ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ప్రధానికి లేఖ రాస్తే... డీజీపీ స్పందించడమేంటీ? '

ఫోన్​ ట్యాపింగ్​ఫై ఆధారాలు ఇవ్వాలన్న డీజీపీ గౌతం సవాంగ్​ లేఖపై తెదేపా అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానికి తాను లేఖ రాస్తే దానిపై డీజీపీ వెంటనే స్పందించడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. వైకాపా నేతల దాడులపై గతంలో తాను రాసిన లేఖలపై ఏం చర్యలు తీసుకున్నారని నిలదీశారు. ఫోన్​ ట్యాపింగ్​ వైకాపాకు ముందు నుంచి అలవాటేనని చంద్రబాబు విమర్శించారు.

'ఫోన్​ ట్యాపింగ్​ వారికి అలవాటే.. ఆధారాలపై డీజీపీ లేఖ హాస్యాస్పదం'
'ఫోన్​ ట్యాపింగ్​ వారికి అలవాటే.. ఆధారాలపై డీజీపీ లేఖ హాస్యాస్పదం'

By

Published : Aug 18, 2020, 4:20 PM IST

Updated : Aug 18, 2020, 4:31 PM IST

ఫోన్ ట్యాపింగ్​పై ఆధారాలు ఇవ్వాలని డీజీపీ తనకు లేఖ రాయడం విడ్డూరంగా ఉందని తెదేపా అధినేత చంద్రబాబు ఎద్దేవా చేశారు. ప్రధానికి తాను లేఖ రాస్తే, డీజీపీ వెంటనే స్పందించడం విచిత్రంగా ఉందన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులపై దాడులు, దౌర్జన్యాలు, తప్పుడు కేసులపై గతంలో ఇచ్చిన వినతులు, రాసిన లేఖలపై డీజీపీ ఏం చర్యలు తీసుకున్నారని నిలదీశారు.

తన విశాఖ పర్యటనను అడ్డుకుంటే డీజీపీ ఏం చేశారని చంద్రబాబు ప్రశ్నించారు. గతంలో ఆత్మకూరుకు తనను వెళ్లనీయకుండా ఇంటి గేట్లకు తాళ్లు కట్టి అడ్డుకున్నారని.. అప్పుడు కోర్టులో నిలబడి చట్టం చదవాల్సిన పరిస్థితులు డీజీపీ ఎందుకు తెచ్చుకున్నారని చంద్రబాబు ప్రశ్నించారు.

వారికి అలవాటే

ఫోన్ ట్యాపింగ్.. వైకాపాకు ముందు నుంచి ఉన్న అలవాటేనని చంద్రబాబు స్పష్టం చేశారు. గతంలో సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ ఫోన్లు ట్యాప్ చేసిన చరిత్ర వైకాపాదని.. చివరికి ఇప్పుడు డాక్టర్ల ఫోన్లను కూడా ట్యాప్ చేసే దుస్థితికి వచ్చారని మండిపడ్డారు. వైకాపా నేతల వేధింపులు తట్టుకోలేక రోగులకు వైద్యం చేయడానికి కూడా డాక్టర్లు ముందుకు రాని దుస్థితి కల్పించారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి..

ఫోన్​ ట్యాపింగ్​పై ఎందుకు విచారణ చేయకూడదు?

Last Updated : Aug 18, 2020, 4:31 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details