CBN tribute to pingali venkaiah: పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా మహనీయుని చిత్రపటానికి తెదేపా అధినేత చంద్రబాబు నివాళులర్పించారు. ఇంటింటా మువ్వన్నెల జెండా ఎగరవేసేందుకు దేశం పిలుపునిచ్చిందని చంద్రబాబు గుర్తుచేశారు. తెలుగు జాతికి పింగళి వెంకయ్య సాధించిపెట్టిన గౌరవమిదని అన్నారు. విద్య, శాస్త్రీయ రంగాల్లోనూ దేశానికి సేవలందించారని తెలిపారు. పింగళి సేవలు, దేశభక్తిని ఈ సందర్భంగా గుర్తుచేసుకుందామని పిలుపునిచ్చారు.
CBN on pingali venkaiah: 'పింగళి సేవలు, దేశభక్తిని గుర్తు చేసుకుందాం' - పింగాళి వెంకయ్యకు లోకేశ్ నివాళి
CBN tribute to pingali venkaiah: పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా ఆయన సేవలను తెదేపా అధినేత చంద్రబాబు, తెదేపా జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ గుర్తు చేసుకున్నారు. పింగళి వెంకయ్య చిత్రపటానికి నివాళులర్పించారు.
పింగళికి నివాళులు
జాతీయ పతాక రూపకర్తగా పింగళి వెంకయ్య భారత జాతికి చిరస్మరణీయులని తెదేపా నేత నారా లోకేశ్ అన్నారు. జాతీయ పతాకం రూపుదిద్ది భారతావనిలో దేశభక్తి ఇనుమడింపచేశారని గుర్తు చేశారు. జాతిపిత ఆత్మీయాభిమానాలు సొంతంచేసుకున్న పింగళి వెంకయ్య చరితార్ధుడని కొనియాడారు. పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళులర్పించారు.
ఇవీ చదవండి:
Last Updated : Aug 2, 2022, 11:58 AM IST