ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'నూతన సంవత్సర వేడుకలకు దూరం ఉందాం'

నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉండాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. వేడుకలకు పెట్టే ఖర్చును రైతుల కోసం ఉద్యమిస్తున్న జెఏసిలకు విరాళంగా ఇవ్వాలని సూచించారు.

chandra babu away from new year celebrations
నూతన సంవత్సర వేడుకలకు దూరంగా తెదేపా

By

Published : Dec 30, 2019, 7:18 PM IST

నూతన సంవత్సర వేడుకలకు తెలుగుదేశం పార్టీ దూరంగా ఉండనుంది. వేడుకల కోసం చేసే ఖర్చులు అమరావతి పరిరక్షణ సమితి ఐకాసకు విరాళం ఇవ్వాలని తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. ఆ రోజు రైతులు, కూలీలకు సంఘీభావంగా నిలబడాలని... గ్రామాల్లో పర్యటించి రైతులు, కూలీల కుటుంబాలకు అండగా ఉండాలని సూచించారు.

ఇది వేడుకలు చేసుకునే సమయం కాదని... రాజధానిలో వేలాది రైతు కుటుంబాలు, మహిళలు రోడ్లపై ఉన్నారని చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. వాళ్ల ఆవేదన అందరూ అర్ధం చేసుకోవాలన్నారు.

భూములిచ్చిన రైతులకు రాష్ట్రంలోని రైతాంగం మద్దతుగా నిలవాలని సూచించారు. రోడ్డెక్కి ఆందోళన చేస్తున్న మహిళలకు రాష్ట్రంలోని మహిళలంతా అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

నూతన సంవత్సర వేడుకలకు పెట్టే ఖర్చును రైతుల కోసం ఉద్యమిస్తున్న జెఏసిలకు విరాళంగా ఇవ్వాలని పిలుపునిచ్చారు. భూములిచ్చిన రైతులనే రోడ్డెక్కిస్తే భవిష్యత్​లో ఎవరూ భూములు ఇవ్వరని హెచ్చరించారు. ఇది సమాజానికి మంచి సందేశం కాదన్నారు.

ఇదీ చదవండి

రాజధాని ఎక్కడున్నా సమస్యలేదు...కానీ..

ABOUT THE AUTHOR

...view details