తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. దక్షిణ ఛత్తీస్‌గఢ్‌లో ఉపరితల ఆవర్తనం బలహీనపడిందని.. తెలంగాణ నుంచి తమిళనాడు వరకు ఉత్తర-దక్షిణ ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ అధికారులు వెల్లడించారు.
తెలంగాణలో వర్షం పడే అవకాశం - తెలంగాణ వాతావరణ నివేదిక
గత కొన్ని రోజులుగా వేసవి తాపంతో అల్లాడిపోయిన తెలంగాణ రాష్ట్రవాసులకు ఇవాళ కాస్త ఉపసమనం లభించనుంది. రాష్ట్రంలో నేడు పలు ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది.
తెలంగాణలో వర్షం పడే అవకాశం
వీటి ప్రభావం వల్ల తెలంగాణ తూర్పు, దక్షిణ జిల్లాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు. కుమురం భీం, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సంచాలకులు వివరించారు.
ఇదీ చూడండి:కృష్ణపట్నం పోర్టులో అదానీ గ్రూప్ 100% పెట్టుబడులు