ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Kishan Reddy: తాటాకు చప్పుళ్లకు భయపడం.. కేసీఆర్​కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కౌంటర్

తెలంగాణ సీఎం కేసీఆర్‌(cm kcr news) తాటాకు చప్పుళ్లకు ఎవరూ భయపడరని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి(kishan reddy latest news) అన్నారు. ధాన్యం సేకరణకు కేంద్రం చేపట్టిన చర్యలను తెలంగాణ ప్రజలకు వివరిస్తామని ఆయన చెప్పారు. ధాన్యం సేకరణ కోసం కేంద్రం పెద్దఎత్తున ఖర్చు చేస్తోందని తెలిపారు. పంజాబ్ తర్వాత అత్యధికంగా తెలంగాణ నుంచే ధాన్యం సేకరిస్తున్నట్లు స్పష్టం చేశారు.

https://www.etvbharat.com/telugu/andhra-pradesh/city/amaravati/notification-issued-for-3-mlc-seats-under-mlas-quota-in-andhrapradesh/ap20211109122141867
https://www.etvbharat.com/telugu/andhra-pradesh/city/amaravati/notification-issued-for-3-mlc-seats-under-mlas-quota-in-andhrapradesh/ap20211109122141867

By

Published : Nov 9, 2021, 1:33 PM IST

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR News) తాటాకు చప్పుళ్లకు ఎవరూ భయపడరని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి(kishan reddy latest news) వ్యాఖ్యానించారు. పంజాబ్ తర్వాత అత్యధికంగా తెలంగాణ నుంచే ధాన్యం సేకరిస్తున్నామని తెలిపారు. ధాన్యం సేకరణకు కేంద్రం చేపట్టిన చర్యలను తెలంగాణ ప్రజలకు వివరిస్తామని పేర్కొన్నారు. 2014లో ప్రధాని మోదీ ప్రభుత్వం రాక ముందు కేంద్ర ప్రభుత్వం తెలుగురాష్ట్రాల్లో 64 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించిందని.. భాజపా ప్రభుత్వం 151 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తోందని వెల్లడించారు. 2014లో తెలంగాణలో 43 లక్షల మెట్రిక్ టన్నులే సేకరించారన్న కేంద్రమంత్రి.. ప్రస్తుతం తెలంగాణలో 94 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తోందని వివరించారు. కేసీఆర్‌ నిన్న, మొన్న నిర్వహించిన మీడియా సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం తీరు, ధాన్యం కొనుగోళ్లపై ఆరోపణలు చేసిన నేపథ్యంలో కిషన్‌రెడ్డి దిల్లీలో మీడియాతో మాట్లాడారు.

ధాన్యం సేకరణ కోసం(paddy procurement in telangana) కేంద్రం పెద్దఎత్తున ఖర్చు చేస్తోందని కేంద్రమంత్రి(kishan reddy latest news) తెలిపారు. రైతుల గన్నీ సంచులకు కూడా కేంద్రమే డబ్బులిస్తోందని పేర్కొన్నారు. ధాన్యం సేకరణలో రాష్ట్ర ప్రభుత్వంపై రూపాయి కూడా భారం పడదన్న కేంద్రమంత్రి(kishan reddy latest news)... పంజాబ్ తర్వాత అత్యధికంగా తెలంగాణ నుంచే ధాన్యం సేకరిస్తున్నామని... పంజాబ్‌ నుంచి 135 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తోందని... తెలంగాణ నుంచి 94 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తోందని వివరించారు. ప్రతి సంవత్సరం కూడా కేంద్రమే ధాన్యం కొనుగోలు చేస్తోందని తెలిపారు. ధాన్యం సేకరణకు కేంద్రం రూ.26,640 కోట్లు ఖర్చు చేస్తోందని వెల్లడించారు. 2014లో ఉన్న రూ.3,400 కోట్ల నుంచి రూ.26,640 కోట్లకు పెంచామని పేర్కొన్నారు. 41 లక్షల మెట్రిక్ టన్నులకే ఒప్పందం చేసుకున్నారన్న కేంద్రమంత్రి... ఇప్పుడేమో 108 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించాలంటున్నారని అన్నారు. ఇప్పటికీ కూడా రా రైస్​ను కేంద్రం కొనుగోలు చేస్తోందని చెప్పారు. రైతులను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు మానుకోవాలని సూచించారు. ఐకేపీ కొనుగోలు కేంద్రాలు వద్దని రాష్ట్ర ప్రభుత్వమే చెప్పిందన్న ఆయన.. సరైన అవగాహన లేకుండా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు.

'సీఎం కేసీఆర్ బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారు. తెలంగాణలో బాయిల్డ్ రైస్ ఎవరూ తినరు. దేశంలో బాయిల్డ్ రైస్ ఉపయోగం లేకుండా ఉంది. రైతులు కూడా ఎవరూ బాయిల్డ్ రైస్ పండించరు. బాయిల్డ్ రైస్ ఉత్పత్తి చేసేది మిల్లర్లే. రా రైస్ ఇస్తే ఎంతైనా తీసుకుంటామని చెప్పారు. గతేడాది 44.75 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు బియ్యాన్ని కేంద్రం తీసుకుంది. రాబోయే రోజుల్లో దొడ్డు బియ్యాన్ని తగ్గిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. అన్ని రైస్ మిల్లుల్లో రా రైస్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకుంటామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి ధాన్యం ఉత్పత్తిని సరిగా అంచనా వేయలేకపోయింది. ధాన్యం ఎంత ఉత్పత్తి అవుతుందో అంచనా వేయలేకపోతున్నారు. 108 లక్షల మెట్రిక్ టన్నులు ఉంటుందని సెప్టెంబరు 29న లేఖ రాశారు. కంటిచూపుతో అంచనా వేసినట్లు లేఖలో తెలిపారు. సరైన అంచనా, సర్వే లేకుండా బాధ్యతారహితంగా లేఖ రాశారు.'

-కిషన్ రెడ్డి, కేంద్రమంత్రి

ధాన్యం సేకరణకు కేంద్ర ప్రభుత్వం, బ్యాంకులు సహకరిస్తాయని కిషన్‌రెడ్డి చెప్పారు. దిల్లీలో ధర్నాలు చేస్తామని చెబుతున్నారని.. దిల్లీలో ధర్నాలు చేస్తే భయపడే ప్రభుత్వం లేదని అన్నారు. వైద్య కళాశాలల విషయంలో కూడా అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. వైద్య కళాశాలల విషయమై ఎప్పుడైనా కేంద్ర అధికారులతో మాట్లాడారా? అని ప్రశ్నించారు.

పెట్రోల్ విషయంలో కూడా అబద్ధాలు చెబుతున్నారు. రూపాయి కూడా అవినీతి లేకుండా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోంది. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరిగితే పెట్రోల్ ధరలు పెరుగుతాయి. జీఎస్టీ ఆదాయం పడిపోతే తప్పనిసరి పరిస్థితుల్లో సెస్ పెంచాం. జీఎస్టీ ఆదాయం మెరుగుపడిందనే ధరలు తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం. పెట్రోల్, డీజిల్ ధరలు కూడా తగ్గించాం. కేంద్రానికి అనేక రకాలుగా ఖర్చు పెట్టాల్సిన బాధ్యత ఉంటుంది. 80 కోట్లమందికి ఏడాది పాటు ఉచితంగా రేషన్ ఇస్తున్నాం. దేశ ప్రజలందరికీ ఉచితంగా కొవిడ్ టీకాలు ఇస్తున్నాం. కేంద్రం దోచుకుంటుందని మాట్లాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వమే ధరలు పెంచినట్లు చెబుతున్నారు. కరోనా లేని సమయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ పెంచింది.

-కిషన్ రెడ్డి, కేంద్రమంత్రి

ఇదీ చదవండి:

MLC Elections: రాష్ట్రంలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్.. 29న పోలింగ్

ABOUT THE AUTHOR

...view details