GAJENDRASINGH: రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపదీ ముర్ముకు మద్దతు ఇవ్వాలని వైకాపాను కోరినట్లు రాష్ట్రపతి ఎన్నికల నిర్వహణ కమిటీకి నేతృత్వం వహిస్తున్న కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ చెప్పారు. ఈ విషయాన్ని సోమవారం ఏఎన్ఐ వార్తా సంస్థ ట్విటర్లో పోస్టు చేసింది. ‘ద్రౌపదీ ముర్మును రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఆమెకు మద్దతు ఇవ్వాలని ఎన్డీయే పక్షాలన్నింటికీ భాజపా విజ్ఞప్తి చేసింది. మేం వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డికీ విజ్ఞప్తి చేశాం. ఆమె నామినేషన్ కార్యక్రమంలో ఇతర నేతలతోపాటు వైకాపా ఉభయ సభాపక్ష నేతలు పాల్గొన్నారు’ అని గజేంద్రసింగ్ షెకావత్ చెప్పినట్లు ఏఎన్ఐ సంస్థ వెల్లడించింది.
రాష్ట్రపతి ఎన్నికల్లో 'వైకాపా' మద్దతు కోరాం: కేంద్ర మంత్రి గజేంద్రసింగ్
GAJENDRASINGH: రాష్ట్రపతి ఎన్నికల్లో వైకాపా మద్దతు కోరినట్లు ఆ ఎన్నికల నిర్వహణ కమిటీకి నేతృత్వం వహిస్తున్న కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ చెప్పారు. ఈ విషయాన్ని ఏఎన్ఐ వార్తా సంస్థ ట్విటర్లో పోస్టు చేసింది.
GAJENDRASINGH