ఆంధ్రప్రదేశ్

andhra pradesh

gajendra: పోలవరం ప్రాజెక్టు ఏపీ జీవనాడి - కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్

gajendra singh: పోలవరం ప్రాజెక్టు వద్ద భాజపా కార్యకర్తలు నిర్వహించిన సమావేశానికి కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ హాజరయ్యారు. ప్రపంచంలోనే అత్యంత పెద్ద రాజకీయ పార్టీగా భాజపా ఉందని ధీమా వ్యక్తం చేశారు. రెండేళ్ల క్రితం పోలవరం ప్రాజెక్టుకు వచ్చి ఉంటే ఇంకా వేగంగా పనులు పూర్తి అయ్యేవని కేంద్రమంత్రి అభిప్రాయపడ్డారు. ప్రాజెక్టు పూర్తికి కేంద్ర ప్రభుత్వం ప్రతీ పైసా చెల్లిస్తుందని, అలాగే పునర్విభజన చట్టంలోను అంశాలను కేంద్రం ఒక్కొక్కటిగా నెరవేరుస్తుందని స్పష్టంచేశారు.

By

Published : Mar 4, 2022, 7:30 PM IST

Published : Mar 4, 2022, 7:30 PM IST

central minister gajendra singh party meeting at polavaram
పోలవరం ప్రాజెక్టు ఏపీ జీవనాడి

shekhawat: పోలవరం ప్రాజెక్టు వద్ద భాజపా కార్యకర్తలు నిర్వహించిన సమావేశానికి కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ హాజరయ్యారు. సీఎం భద్రత కారణంగా ప్రాజెక్టుకు దూరంగా భాజపా సభకు అనుమతి ఇచ్చారు. రెండేళ్ల క్రితం పోలవరం ప్రాజెక్టుకు వచ్చి ఉంటే ఇంకా వేగంగా పనులు పూర్తి అయ్యేవని కేంద్రమంత్రి అభిప్రాయపడ్డారు. ప్రపంచంలోనే అత్యంత పెద్ద రాజకీయ పార్టీగా భాజపా ఉందని అన్నారు.

చాలా రాష్ట్రాల్లో భాజపా అధికారంలో ఉందని, కాంగ్రెస్ అధికారంలో ఉన్న కాలంలోనూ ఇన్ని చోట్ల అధికారంలో లేదన్నారు. ఆంధ్రప్రదేశ్​లో భాజపా చాలా బలపడాల్సి ఉందని, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం మరింత ముందుకు వెళ్ళాలని ఆకాంక్షించారు. రెండు సార్లు పార్టీకి సంపూర్ణమైన మద్దతు ప్రజలు అందించారని తెలిపారు. కరోనా వల్ల భారత్​లో ఏం జరుగుతుందోనని చాలా దేశాలు భయపడ్డాయని, ఇండియాలోనూ ఆందోళన వ్యక్తం అయ్యిందన్నారు. అన్ని వైద్య సౌకర్యాలు ఉన్న అమెరికా, యూరప్ లాంటి దేశాలూ కరోనాతో వణికాయన్నారు. అన్ని దేశాల్లోనూ ఇబ్బందులు ఉంటే భారత్ దాన్ని దీటుగా ఎదుర్కొందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.

భారతదేశంలో ఉత్పత్తి అయిన టీకాను ఇతర దేశాలు ఇప్పుడు వినియోగిస్తున్నాయని తెలిపారు. రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం వస్తే ఇప్పుడు ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తోందన్నారు. ఏపీలోను కమలం వికసిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు ఏపీ జీవనాడి అని తేల్చిచెప్పారు. ప్రాజెక్టు పూర్తికి కేంద్ర ప్రభుత్వం ప్రతీ పైసా చెల్లిస్తుందని, అలాగే పునర్విభజన చట్టంలోను అంశాలను కేంద్రం ఒక్కొక్కటిగా నెరవేరుస్తుందని గజేంద్ర షెకావత్ స్పష్టంచేశారు.

అధికారుల సమావేశంలోనూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం చెల్లించాల్సిన నిధులు ఇవ్వాలని ఆదేశించామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్​కి చెందిన రైతులకు సాగునీరు, మారుమూల ప్రాంతాలకు తాగునీరు అందాలని కోరారు. నిర్వాసిత కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్, ఎమ్మెల్సీ మాధవ్ తదితర నేతలు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:'ఉక్రెయిన్​ను వీడిన 20 వేల మంది భారతీయులు'



ABOUT THE AUTHOR

...view details