తిరుమల శ్రీవారిని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆలయానికి చేరుకున్న కేంద్ర మంత్రికి తితిదే ఆధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికి శేషవస్త్రంతో సత్కరించారు.
స్వామివారి తీర్థ ప్రసాదాలను ఆలయాధికారులు అందజేశారు. జమ్ము కశ్మీర్‌ను పూర్తిగా వీలినం చేయడం సంతోషం కలిగిస్తోందని కిషన్ రెడ్డి తెలిపారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రజలందరూ సంతోషంగా ఉండేలా మోదీ పాలన సాగుతోందన్నారు. మతం అనేది వ్యక్తిగతమని.. అయితే... సామూహిక మత మార్పిడీలను మాత్రం ప్రోత్సహించేది లేదని చెప్పారు.