ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రానికి ఉపాధి హామీ నిధులు.. రూ.622 కోట్లు విడుదల చేసిన కేంద్రం

NREGS: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కూలీలకు వేతనాల చెల్లింపుల నిమిత్తం కేంద్ర ప్రభుత్వం రూ. 622 కోట్ల నిధులు విడుదల చేసింది. కూలీలకు వేతనాల కోసం రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం రూ. 685.12 కోట్లు మంజూరు చేసిందని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్‌ పేర్కొన్నారు.

NREGS
ఉపాధి వేతనాల విడుదల

By

Published : May 14, 2022, 7:53 AM IST

NREGS: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కూలీలకు వేతనాల చెల్లింపుల నిమిత్తం కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. కూలీలకు డబ్బుల చెల్లింపు కోసం రూ. 622 కోట్లు విడుదల చేసినట్లు రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్‌ కోన శశిధర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. గత రెండురోజుల వ్యవధిలో రూ. 302.96 కోట్లు కూలీల ఖాతాల్లో జమ అయ్యాయని, మిగిలిన రూ.319 కోట్లు మరో రెండు, మూడు రోజుల్లో జమ అవుతాయని పేర్కొన్నారు. కూలీలకు వేతనాల కోసం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రూ. 685.12 కోట్లు మంజూరు చేసిందని కమిషనర్‌ వివరించారు.

కూలీల హాజరుకు యాప్‌ వినియోగం తప్పనిసరి:ఉపాధి కూలీల హాజరుకు సంబంధించి జాతీయ మొబైల్‌ పర్యవేక్షణ వ్యవస్థ (ఎన్‌ఎంఎంఎస్‌) యాప్‌ వినియోగాన్ని కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఈనెల 16 నుంచి అన్ని రాష్ట్రాల్లో దీనిని అమలు చేయాలని తెలిపింది. రిజిస్టర్‌లో సంతకం, వేలిముద్రలు వేయించే విధానానికి స్వస్తి పలకాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ సూచించింది. పని ప్రదేశంలో ఎన్‌ఎంఎంఎస్‌ యాప్‌లో కూలీల హాజరు నమోదుతోపాటు ఫొటోలు కూడా తీసి అప్‌లోడ్‌ చేయాలని పేర్కొంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details