ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మీరేం తింటారు? ఇంట్లో ల్యాప్‌టాప్‌, ఇంటర్నెట్‌ ఉన్నాయా? - ap census news latest

జనగణన 2021 కార్యక్రమంలో భాగంగా నివాస గృహాలకు సంబంధించిన సమాచారమూ సేకరించాలని కేంద్ర హోం మంత్రిత్వశాఖ నిర్ణయించింది. దీనిలో భాగంగా 31 అంశాలతో కూడిన సమాచార సేకరణ పత్రాన్ని రూపొందించింది. ఈ మేరకు రాజపత్రాన్ని పునర్ముద్రించాలని సాధారణ పరిపాలనశాఖ గురువారం ఉత్తర్వులిచ్చింది. ఇందులో నివాసం, కుటుంబం, సాంకేతికత వినియోగం, వాహన వివరాలనూ సేకరిస్తారు. ఆహారంగా ఏరకమైన ధాన్యం తీసుకుంటారనే ప్రశ్ననూ ఇందులో పొందుపరచడం గమనార్హం.

census  2020
census 2020

By

Published : Jan 31, 2020, 7:14 AM IST

హైదరాబాద్‌లోనే జనగణన డైరెక్టరేట్‌

ఆంధ్రప్రదేశ్‌లో జనగణనకు సంబంధించి ప్రత్యేక డైరెక్టరేట్‌ ఏర్పాటైనా మరే రాష్ట్రంలోనూ లేని విధంగా కార్యాలయం హైదరాబాద్‌లోని కోఠికే పరిమితమైంది. రాష్ట్రంలో ఏప్రిల్‌ 1 నుంచి జనగణన మొదలు కానుంది. దీన్ని పర్యవేక్షించాల్సిన జనగణన కార్యకలాపాల డైరెక్టరేట్‌ హైదరాబాద్‌ను వీడి రానంటోంది. అక్కడ నుంచే ఉత్తర ప్రత్యుత్తరాలను సాగిస్తోంది. క్షేత్ర స్థాయి సిబ్బందికి ఏవైనా సందేహాలు తలెత్తినా, ఏ అవసరమున్నా హైదరాబాద్‌లోని కార్యాలయంతోనే సంప్రదింపులు చేయాల్సి వస్తోంది.

ఏపీ సెన్సెస్‌ డైరెక్టర్‌గా ఎస్‌.సత్యనారాయణ

ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టే జనగణన(సెన్సెస్‌), సిటిజన్‌ రిజిస్ట్రేషన్‌ డైరెక్టర్‌గా 2006 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి ఎస్‌.సత్యనారాయణను నియమిస్తూ కేంద్ర సిబ్బంది వ్యవహారాలశాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ ప్రభుత్వం సిఫార్సు మేరకు ఆయనను నియమిస్తున్నట్లు పేర్కొంది. 2023 మార్చి 31వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారని స్పష్టం చేసింది.

నమోదు చేసే అంశాలు

  1. ఇంటి నంబరు
  2. జనగణన ఇంటి నంబరు
  3. ఇంటి నేల, గదులు, కప్పు స్వభావం
  4. ఇంటిని ఎందుకు వినియోగిస్తున్నారు
  5. ఇంటి పరిస్థితి
  6. కుటుంబ సంఖ్య
  7. కుటుంబంలోని సభ్యుల సంఖ్య
  8. కుటుంబ యజమాని పేరు
  9. కుటుంబ యజమాని మగ/ఆడ
  10. కుటుంబ యజమాని ఎస్సీ, ఎస్టీ వర్గానికి చెందినవారా?
  11. ఇంటి సొంతదారు
  12. కుటుంబ ఆధీనంలో ఉన్న గదులు
  13. కుటుంబంలో పెళ్లయిన దంపతులు
  14. తాగునీటికి ఆధారమేంటి?
  15. తాగునీరు ఎక్కడ నుంచి వస్తుంది?
  16. వెలుగుల పరిస్థితి ఏమిటి?
  17. మరుగుదొడ్డి ఉందా?
  18. మరుగుదొడ్డి ఏ రకమైనది?
  19. వ్యర్థజలం పోయే మార్గముందా?
  20. స్నానాల గది ఉందా?
  21. వంటగది ఉందా? ఎల్‌పీజీ కనెక్షన్‌ తీసుకున్నారా?
  22. వంటకు ఏం ఉపయోగిస్తున్నారు?
  23. రేడియో/ట్రాన్సిస్టర్‌ ఉందా?
  24. టెలివిజన్‌
  25. అంతర్జాలం
  26. ల్యాప్‌టాప్‌/కంప్యూటర్‌
  27. టెలిఫోన్‌/మొబైల్‌/స్మార్ట్‌ఫోన్‌
  28. సైకిల్‌/స్కూటర్‌/ మోటార్‌సైకిల్‌/మోపెడ్‌
  29. కారు/జీపు/వ్యాన్‌
  30. ఆహారానికి ఉపయోగించే ప్రధానమైన ధాన్యమేంటి?
  31. మొబైల్‌ నంబరు (జనగణనకు సంబంధించిన సమాచార నిమిత్తమే)

ABOUT THE AUTHOR

...view details