ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Obulapuram Mining Case: ఐఏఎస్ శ్రీలక్ష్మి డిశ్చార్జ్ పిటిషన్​పై సీబీఐ కోర్టు విచారణ - discharge petition of IAS officer Srilakshmi

ఐఏఎస్ శ్రీలక్ష్మి దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్​పై సీబీఐ కోర్టు విచారణ జరిపింది. వాదనలు వినిపించేందుకు చివరగా ఓ అవకాశం ఇస్తున్నామని కోర్టు స్పష్టం చేస్తూ.. ఈనెల 29కి విచారణ వాయిదా వేసింది.

discharge petition of  IAS officer Srilakshmi
Obulapuram Mining Company case

By

Published : Jun 22, 2021, 5:29 PM IST

ఓబుళాపురం మైనింగ్ కేసు(Obulapuram Mining Case)లో నిందితురాలైన ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మీ దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్​లో వాదనలు వినిపించడానికి చివరిగా ఓ అవకాశం ఇస్తున్నామని సీబీఐ కోర్టు స్పష్టం చేసింది. ఈ నెల 29న వాదనలు వినిపించని పక్షంలో ఏకపక్షంగా విచారణ చేపట్టి ఉత్తర్వులు వెలువరించాల్సి ఉంటుందని పేర్కొంది.

బుళాపురం గనుల అక్రమ మైనింగ్ వ్యవహారంపై సీబీఐ దాఖలు చేసిన కేసులో సీబీఐ ప్రధాన కోర్టు న్యాయమూర్తి బి.ఆర్. మధుసూదనరావు విచారణ చేపట్టారు. సీబీఐ కేసును కొట్టివేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు ఈ కేసులో 6 వ నిందితురాలైన ఐఏఎస్ శ్రీలక్ష్మి తరఫు న్యాయవాది తెలిపారు. గత ఏడాది తాను పిటిషన్ దాఖలు చేశానని, సీబీఐ కూడా కౌంటరు దాఖలు చేసిందని, ఈ నెల 25 న విచారణకు రానుందని చెప్పారు. వాదనలను విన్న న్యాయమూర్తి.. ఈ కేసు విచారణను నిలిపివేస్తూ హైకోర్టు ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేదని, అందువల్ల వచ్చే విచారణ నాటికి వాదనలు వినిపించాల్సి ఉంటుందని స్పష్టం చేస్తూ ఈ నెల 29 వ తేదీకి వాయిదా వేశారు. దీంతోపాటు కొన్ని పత్రాలు అందించాలంటూ గాలి జనార్దన్ రెడ్డి , గనుల శాఖ మాజీ డైరెక్టర్ వి.డి.రాజగోపాల్, మాజీ ఐఏఎస్ కృపానందంలు దాఖలు చేసిన డిశ్ఛార్జి పిటిషన్ పై విచారణను 29 వ తేదీకి వాయిదా వేశారు.

ABOUT THE AUTHOR

...view details