ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Cases Dismissed: కాపు ఉద్యమానికి సంబంధించి.. 161 కేసుల ఎత్తివేత - కాపు ఉద్యమానికి సంబంధించి కేసుల ఎత్తివేత

Cases Dismissed in Kapu Movement: కాపుల రిజర్వేషన్‌ ఉద్యమానికి సంబంధించి ఉద్యమకారులపై నమోదైన మరో 161 కేసుల్ని రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేసింది. ఈ మేరకు ముఖ్య కార్యదర్శి కుమార్‌ విశ్వజిత్‌.. డీజీపీకి ఉత్తర్వులు జారీ చేశారు.

Cases Dismissed
Cases Dismissed

By

Published : Feb 4, 2022, 10:46 AM IST

కాపుల రిజర్వేషన్‌ ఉద్యమానికి సంబంధించి ఉద్యమకారులపై నమోదైన మరో 161 కేసుల్ని రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేసింది. వీటిలో నిందితులపై విచారణను ఉపసంహరించుకునేలా పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లను ఆదేశించాలంటూ డీజీపీకి సూచిస్తూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్‌ విశ్వజిత్‌ గురువారం ఉత్తర్వులు ఇచ్చారు. 2016 జనవరి నుంచి 2019 మార్చి మధ్య కాపు రిజర్వేషన్‌ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులపై మొత్తం 329 కేసులు నమోదయ్యాయి. వాటిల్లో 68 కేసుల్ని ప్రభుత్వం ఇప్పటికే ఉపసంహరించింది. మరో 85 కేసులు కింది స్థాయిలో పరిష్కారమయ్యాయి. 176 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిల్లో ఒకటి రైల్వే ఆస్తుల ధ్వంసానికి సంబంధించింది.

దాని ఉపసంహరణకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం సమ్మతి కోరింది. అది మినహా మిగతా 175లో 161 కేసుల్ని ఉపసంహరించుకుంటూ తాజాగా ఉత్తర్వులిచ్చింది. మరో 14 కేసులు దర్యాప్తు దశలో ఉన్నాయి. వాటిని వీలైనంత వేగంగా చట్టప్రకారం డిస్పోజ్‌ చేయాలంటూ ఈ ఉత్తర్వుల్లో డీజీపీని ఆదేశించింది.

ABOUT THE AUTHOR

...view details