రాజధానిపై స్పష్టత కోసం 6 నెలలుగా పోరాడుతున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని రాజధాని ప్రాంత రైతులు మండిపడ్డారు. తుళ్లూరులో రైతుల రౌండ్ టేబుల్ సమావేశం పేరిట వైకాపా కార్యకర్తలు ఏర్పాటు చేసిన సమావేశానికీ... తమకూ ఎలాంటి సంబంధం లేదన్నారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధానిని మార్చుకుంటూ పోతే ఎలా అని ప్రశ్నించారు. చంద్రబాబుపై కక్ష సాధింపు కోసం అమరావతిని వాడుకోవద్దని విజ్ఞప్తి చేశారు. తమకు పార్టీలతో ఎలాంటి సంబంధం లేదని... రాజధానిపై స్పష్టత, అభివృద్ధి కోసమే తమ పోరాటమని స్పష్టం చేశారు.
'ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధాని మారుస్తారా' - updates on amaravathi
తుళ్లూరులో రైతుల రౌండ్ టేబుల్ సమావేశం పేరిట వైకాపా కార్యకర్తలు ఏర్పాటు చేసిన సమావేశానికీ... తమకూ ఎలాంటి సంబంధం లేదని రాజధాని రైతులు అన్నారు. రాజధానిపై స్పష్టత, అభివృద్ధి కోసమే తమ పోరాటమని స్పష్టం చేశారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధానిని మార్చుకుంటూ పోతే ఎలా అని నిలదీశారు.
రాజధానిపై స్పష్టత అంశంపై రైతులు