ప్రధాని హోదాలో నరేంద్ర మోదీ వచ్చి రాజధాని కోసం శంకుస్థాపన చేశారనే.. భూ సమీకరణకు తమ భూములు ఇచ్చినట్లు అమరావతి ప్రాంత రైతులు స్పష్టంచేశారు. రాజధాని వ్యయం పెరుగుతోందనీ.. వరద ప్రమాదం ఉందన్న మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యల నేపథ్యంలో అమరావతి రైతులు రాజకీయ పక్షాలను కలిశారు. వారి మద్దతు కోరారు. అమరావతిలోనే రాజధానిని ఉంచాలన్నారు. ప్రభుత్వ భవనాలకు కొన్ని ఇప్పటికే పూర్తయ్యాయనీ.. మరికొన్ని పనులు జరుగుతున్నాయనీ.. వాటిని తరలించడం సాధ్యమయ్యే పని కాదని చెప్పారు. తమకు కౌలు నిలిపివేశారని వాపోయారు. వేరే ప్రాంతానికి రాజధాని తరలిస్తే అంగీకరించేది లేదంటున్న రైతులతో మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ ముఖాముఖి.
'రాజధాని తరలిస్తామంటే.. అందుకు మేం ఒప్పుకోం' - రాజధాని
'రాజధానిని అమరావతి నుంచి వేరే ప్రాంతానికి తరలిస్తానంటే మేం అందుకు అంగీకరించం. వేల ఎకరాలు ఇచ్చింది ఇక్కడి వారికి న్యాయం జరుగుతుందనే. ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధాని మారుస్తూ పోతే ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని లేకుండా పోతుంది.' -- రాజధాని ప్రాంత రైతులు
'రాజధాని తరలిస్తామంటే.. అందుకు మేం ఒప్పుకోం'