Cyber Attack on Midhani: కెనడా సంస్థ మెయిల్ ఐడీని సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. ఆపై నకిలీ ఐడీ నుంచి మిధాని అధికారులకు సందేశం పంపారు. వారి ఆదేశాల మేరకు మెయిల్‌లో సూచించిన ఖాతాకు మిధాని అధికారులు రూ.40 లక్షలను బదిలీ చేశారు. నగదు రాలేదని కెనడా నుంచి ఫోన్ రావడంతో ఈ మోసం బయటపడింది. కెనడా సంస్థ తప్పిదం వల్లే సైబర్ మోసం జరిగిందని మిధాని అధికారులు వాపోతున్నారు. ఈ ఘటనపై సైబర్‌క్రైం పోలీసులకు మిధాని అధికారులు ఫిర్యాదు చేశారు. ఇటీవల కెనడా సంస్థ నుంచి మిధాని అధికారులు అల్యూమినియం కొనుగోలు చేశారు. ఈ లావాదేవీల్లో భాగంగానే, ఈ చెల్లింపులు జరిగినట్లు సమాచారం.
హైదరాబాద్ మిధాని సంస్థపై సైబర్ అటాక్.. రూ.40 లక్షలు టోకరా
Cyber Crime: స్టూడెంట్.. టీచర్.. పోలీస్.. జడ్జి.. ఇలా ఎవరైతే మాకేంటీ.. మా ఉచ్చుకు ఎవరైనా చిక్కాల్సిందే అంటున్నారు సైబర్ కేటుగాళ్లు. తాజాగా ఓ కేంద్ర సంస్థకే టోకరా వేసి.. పోలీసులకు సవాల్ విసిరారు. హైదరాబాద్‌లోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన మిధానికి రూ.40 లక్షల కుచ్చుటోపి పెట్టి.. చేతనైతే మమ్మల్ని పట్టుకోండి చూద్దాం అంటున్నారు.
cyber