రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం ముగిసింది. వైఎస్ఆర్ చేయూత పథకానికి మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఎస్సీ, ఎస్టీ బీసీ మహిళలకు నాలుగేళ్లలో 50 వేల రూపాయల ఆర్థిక సాయం అందించే విధంగా నిర్ణయం తీసుకున్నారు. ఈ పథకాన్ని ఆగస్టు 12 ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించనున్నారు.
రామాయపట్నం పోర్టుపై మంత్రివర్గం చర్చించింది. కేంద్ర నిధుల కోసం ప్రయత్నిస్తూ.. ప్రాజెక్టుపై ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. ఐదు దశల్లో రామాయపట్నం పోర్టు ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టనున్నారు. ఆగస్టు నాటికి టెండర్లు పిలవాలనీ.. మెుదటి దశలో 4,736 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణం చేపట్టాలని సీఎం జగన్ సూచించారు. పోర్టు టెండర్లను జూడిషీయల్ ప్రివ్యూకి పంపించాలని జగన్ ఆదేశించారు. 10వేల మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి... డిస్కమ్, ట్రాన్స్కోలకు 6 వేల కోట్ల ఆత్మనిర్బర్ భారత్ నిధుల ఖర్చుకు కేబినేట్ ఆమోదం తెలిపింది.