పరమ పవిత్రమైన తుంగభద్ర పుష్కరాల నిర్వహణను జగన్ ప్రభుత్వం ప్రశ్నార్థకం చేసిందని తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షులు బీవీ.జయనాగేశ్వర రెడ్డి ఆరోపించారు. తుంగభద్ర నదీ పుష్కరాల నిర్వహణ, పనుల పురోగతిని వైకాపా ప్రభుత్వం గాలికొదిలేసిందని మండిపడ్డారు. పుష్కరాల నిర్వహణలో తమకు చిత్తశుద్ధిలేదని జగన్ ప్రభుత్వం నిరూపించుకుందన్నారు. సంవత్సరం ముందు నిధులు కేటాయించి ప్రణాళికాబద్ధంగా పుష్కరాల పనులు చేయించకుండా, కంటితుడుపు చర్యగా మమ అనిపించారని దుయ్యబట్టారు. రోడ్లు, ఆలయాల అభివృద్ధికి నిధులు కేటాయించలేదన్నారు. పిండప్రదానం చేసే భక్తులకు నదీస్నానమాచరించే అవకాశం లేకుండా చేశారన్న జయనాగేశ్వరరెడ్డి... నదీస్నానాలకు అవకాశం లేనప్పుడు పుష్కర ఘాట్లపేరుతో నిధులెందుకు ఖర్చుచేశారని నిలదీశారు. పుష్కరాలకు హాజరవుతున్న ముఖ్యమంత్రి జగన్ నదీస్నానం చేయాలన్నారు. అప్పుడే అధికారులు ఎంతబాగా పనిచేశారో, భక్తుల అవస్థలేమిటో ఆయనకు తెలుస్తాయని జయనాగేశ్వరరెడ్డి అన్నారు.
'నదీస్నానాలకు అవకాశం లేనప్పుడు పుష్కరఘాట్ల పేరుతో నిధులెందుకు..?'
తుంగభద్ర పుష్కరాల నిర్వహణను ప్రభుత్వం ప్రశ్నార్థకం చేసిందని తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షులు బీవీ.జయనాగేశ్వర రెడ్డి ఆరోపించారు. నదీస్నానాలకు అవకాశం లేనప్పుడు పుష్కర ఘాట్లపేరుతో నిధులెందుకు ఖర్చుచేశారని నిలదీశారు. పుష్కరాలకు హాజరవుతున్న ముఖ్యమంత్రి జగన్ నదీస్నానం చేయాలన్నారు.
బీవీ.జయనాగేశ్వర రెడ్డి