ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

MURDER: హైదరాబాద్​లో యువకుడి దారుణ హత్య - amaravati news

హైదరాబాద్​లోని జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో సంజయ్​ గాంధీ నగర్​కు చెందిన ఓ యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో పొడిచి చంపారు. పాత కక్ష్యల నేపథ్యంలోనే ఈ దారుణం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.

MURDER
MURDER

By

Published : Sep 11, 2021, 8:27 PM IST

హైదరాబాద్​లోని జగద్గిరిగుట్ట సమీపంలోని సంజయ్ గాంధీ నగర్​లో ఓ యువకుడిని దారుణంగా హత్య చేశారు. దేవమ్మ బస్తీలో నివాసం ఉంటూ పెయింటర్​గా పనిచేస్తున్న సురేష్(25) అనే వ్యక్తిని రోషన్, రోహిత్ అనే వ్యక్తులు అటోలో వచ్చి దాడి చేశారు. కడుపులో కత్తితో పొడిచి అక్కడి నుంచి పరారయ్యారు, సురేష్ అక్కడిక్కడే కుప్పకూలగా.. గమనించిన స్థానికులు రక్తపుమాడుగులో ఉన్న అతన్ని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు.

మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన జగద్గిరిగుట్ట పోలీసులు... వీరిమధ్య పాతకక్షలు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో విచారిస్తున్నారు.

ఇదీ చదవండి:

Hyderabad girl rape: సైదాబాద్‌ బాలిక హత్య.. పోలీసుల అదుపులో నిందితుడు

ABOUT THE AUTHOR

...view details