ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 17, 2021, 10:47 PM IST

ETV Bharat / city

నీటి పంపకాలపై కృష్ణా ట్రైబ్యునల్​లో విచారణ

తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపకాల అంశంపై కృష్ణా ట్రైబ్యునల్​లో విచారణ జరిగింది. కృష్ణా ట్రైబ్యూనల్ ఛైర్మన్ బ్రిజేష్ కుమార్ ధర్మాసనంలో తెలంగాణ తరపున సాక్షిగా ఉన్న కేంద్ర జలసంఘం మాజీ ఛైర్మన్ ఘన్ శ్యామ్ ఝాని ఏపీ ప్రభుత్వ న్యాయవాది క్రాస్ ఎగ్జామిన్ చేశారు. గురు, శుక్రవారాల్లోనూ కృష్ణా ట్రైబ్యునల్​లో క్రాస్ ఎగ్జామినేషన్ కొనసాగనుంది.

BRIJESH KUMAR TRIBUNAL
BRIJESH KUMAR TRIBUNAL

తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపకాల అంశంపై కృష్ణా ట్రైబ్యునల్​లో సుమారు ఏడాదిన్నర తర్వాత విచారణ జరిగింది. ఓవైపు కరోనా.. మరోవైపు ఓ జడ్జి రాజీనామా.. కారణంగా ఇన్నాళ్లు విచారణ వాయిదా పడింది. కృష్ణా ట్రైబ్యునల్ ఛైర్మన్ బ్రిజేష్ కుమార్ ధర్మాసనంలో తెలంగాణ తరపున సాక్షిగా ఉన్న కేంద్ర జలసంఘం మాజీ ఛైర్మన్ ఘన్ శ్యామ్ ఝాను ఏపీ ప్రభుత్వ న్యాయవాది క్రాస్ ఎగ్జామిన్ చేశారు.

నాగర్జునసాగర్ ప్రాజెక్టు, కేసీ కెనాల్​కు సంబంధించిన పలు అంశాలపై ఏపీ తరపు సీనియర్ న్యాయవాది వెంకటరమణి ప్రశ్నలు లేవనెత్తగా.. నిపుణులు ఘన్ శ్యామ్ ఝా వాటికి సమాధానం ఇచ్చారు. గురు, శుక్రవారాల్లోనూ కృష్ణా ట్రైబ్యునల్​లో క్రాస్ ఎగ్జామినేషన్ కొనసాగనుంది.

ఇదీ చూడండి:

విజయవాడ మేయర్‌గా రాయన భాగ్యలక్ష్మి!

ABOUT THE AUTHOR

...view details