Road Accident in Kamareddy: ఒకేరోజు రెండు వేర్వేరు ప్రాంతాల్లో భార్యభర్తలిద్దరూ మృత్యువాత పడిన ఘటన కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలంలో చోటు చేసుకుంది. అంతంపల్లికి చెందిన సిద్దయ్య తన ద్విచక్రవాహనంపై వెళ్తుండగా.. గ్రామ శివారున జాతీయ రహదారిలో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఆయన భార్య సిద్దమ్మ, తమ్ముడు లింగం బైక్‌పై ఘటనాస్థలానికి వెళ్తుండగా.. అదుపు తప్పి కిందపడిపోవడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
రోడ్డు ప్రమాదంలో భర్త... విషయం తెలిసి భార్య.. ఒకేరోజు ఇద్దరూ - Road Accident in Kamareddy today
Road Accident in Kamareddy: ఓ రోడ్డు ప్రమాదం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. రోడ్డు ప్రమాదంలో భర్త మరణించాడని తెలుసుకున్న భార్య అతడిని చూసేందుకు బయలుదేరింది. ఇంతలో వీరిని విధి చిన్న చూపు చూసింది. అక్కడికి వెళ్లే క్రమంలో బైక్ అదుపుతప్పి మృతుడి భార్య కూడా కన్నుమూసింది. ఒకేరోజు రెండు వేర్వేరు ఘటనల్లో దంపతులు మృతి చెందటం తెలంగాణ కామారెడ్డి జిల్లాలో విషాదం నింపింది.
accident deaths
సిద్దయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించగా.. అతని భార్య సిద్దమ్మ, తమ్ముడు లింగంను కూడా అదే ఆస్పత్రికి తరలించారు. అయితే తీవ్ర గాయాలపాలైన సిద్దమ్మ చికిత్స పొందుతూ మృతి చెందింది. లింగం పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌కు తరలించారు. ఒకేరోజు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ప్రమాదంలో భార్యభర్తలిద్దరూ మృతిచెందడంతో.. గ్రామంలో విషాధ ఛాయలు అలుముకున్నాయి. మరణించిన దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు.
ఇవీ చదవండి: