ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఆదాయం కోసం ఎందుకంత ఆత్రం'

సీఎం జగన్ మద్యం నిషేధిస్తామని హామీ ఇచ్చి.. ఇప్పుడు మద్యం దుకాణాలు ఎందుకు తెరిచారని భాజపా ప్రశ్నించింది. కరోనా నియంత్రణపై చిత్తశుద్ధి ఉంటే తక్షణం మద్యం దుకాణాలు మూసివేయాలని డిమాండ్ చేసింది.

By

Published : May 6, 2020, 11:17 AM IST

bjp on liquor sales in ap
ఏపీలో మద్యం అమ్మకాలపై భాజాప ఫైర్

వైకాపా ప్రభుత్వానికి మద్యం ద్వారా వచ్చే ఆదాయం కోసం ఆత్రం ఎందుకని భాజపా ప్రశ్నించింది. దశలవారీగా మద్యనిషేధం చేస్తామని సీఎం హామీ ఇచ్చి... మరి ఇప్పుడు ఏ ఆలోచనతో మద్యం దుకాణాలు తెరిచారని నిలదీసింది. కేంద్రం చెబితేనే మద్యం దుకాణాలు తెరిచామనడం సరికాదని వ్యాఖ్యానించింది. మద్యం అమ్మకం, ఆదాయం రాష్ట్ర పరిధిలోని అంశమని గుర్తు చేసింది.

మందు తాగేవారిని అదుపుచేసేందుకు ఉపాధ్యాయులను వాడుకోవడం దారుణమని భాజపా దుయ్యబట్టారు. ఉపాధ్యాయులకు వైకాపా ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. కరోనా నియంత్రణపై చిత్తశుద్ధి ఉంటే తక్షణం మద్యం దుకాణాలు మూసివేయాలని సూచించింది.

ఇదీ చదవండి : మందు కావాలా బాబూ...అయితే గొడుగుతో రా..

ABOUT THE AUTHOR

...view details