BJP MP CM RAMESH: 'రాష్ట్ర పోలీసు వ్యవస్థను కేంద్రం టెలిస్కోప్‌తో చూస్తోంది..'
10:56 December 24
రాష్ట్ర పోలీసు వ్యవస్థపై భాజపా ఎంపీ సి.ఎం.రమేశ్ కీలక వ్యాఖ్యలు
BJP MP CM RAMESH: రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైపోయిందని భాజపా ఎంపీ సీఎం రమేశ్ విమర్శించారు. రాష్ట్ర పోలీసుల తీరును కేంద్రం టెలిస్కోప్‌తో చూసోందన్నారు. త్వరలో వ్యవస్థను ప్రక్షాళన చేసేలా చర్యలు ఉంటాయని తెలిపారు. పార్టీలు అధికారంలోకి వస్తాయి.. పోతాయి.. వ్యవస్థలు ముఖ్యమని సూచించారు. అవసరమైతే కొందరు ఐపీఎస్‌లను కేంద్రం రీకాల్ చేస్తుందని ఆయన వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ నెల 28న బహిరంగ సభ నిర్వహిస్తామని సీఎం రమేష్ పేర్కొన్నారు. సినిమా టికెట్లపై ఉన్న శ్రద్ధ ప్రజాసమస్యలపై ఎందుకు లేదన్న ఆయన... టికెట్ల ధరపై థియేటర్ యజమానులు కోర్టుకెళ్తే హాళ్లు సీజ్ చేస్తారా... అని ప్రశ్నించారు.
ఇదీ చూడండి:
RAIDS IN CINEMA THEATERS : సినిమా హాళ్లలో తనిఖీలు.. థియేటర్ల మూసివేత