ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ : 'ఎమ్మెల్సీ కవితపై అనర్హత వేటు వేయాలి'

ఎమ్మెల్సీ కవితపై అనర్హత వేటు వేయాలని భాజపా నేతలు సీఈసీకి లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రం బోధన్​ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటు హక్కు ఉన్నట్లు తెలిపిన ఆమె... మళ్లీ జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో ఓటేయటాన్ని తీవ్రంగా ఖండించారు.

COMPLIANT ON KAVITA
ఎన్నికల సంఘానికి భాజపా లేఖ

By

Published : Dec 2, 2020, 8:05 PM IST

Updated : Dec 2, 2020, 9:51 PM IST

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అనర్హత వేటు వేయాలని కేంద్ర ఎన్నికల సంఘానికి భాజపా లేఖ రాసింది. తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచిన కవిత... జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో సైతం ఓటు వేశారని లేఖలో వెల్లడించింది. నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసినప్పుడు అఫిడవిట్‌లో... బోధన్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటు హక్కు ఉన్నట్లు తెలిపారని భాజపా పేర్కొంది.

భాజపా నేతలు సీఈసీకి రాసిన లేఖ

జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో బంజారాహిల్స్ చిరునామాతో మరోసారి ఓటు హక్కు వినియోగించుకున్నారని భాజపా నేతలు లేఖలో పేర్కొన్నారు. "నేను ఓటు హక్కు వినియోగించుకున్నాను... మీరూ బయటకు వచ్చి ఓటు వేయండి" అని ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేసినట్లు భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు.

ఇదీ చూడండి: వైఎస్సార్ విగ్రహంపై ఉన్న శ్రద్ధ.. పోలవరంపై లేదు

Last Updated : Dec 2, 2020, 9:51 PM IST

ABOUT THE AUTHOR

...view details