ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

భావనపాడు పోర్టు డీపీఆర్​కు ప్రభుత్వం ఆమోదం

భావనపాడు పోర్టు సమగ్ర ప్రాజెక్టు నివేదికకు ఆమోదం తెలుపుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. భావనపాడు పోర్ట్ డెవలప్​మెంట్ కార్పొరేషన్ ద్వారా పోర్టు నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకుంది.

bhavanapadu port
bhavanapadu port

By

Published : Aug 25, 2020, 5:50 PM IST

శ్రీకాకుళం జిల్లాలోని భావనపాడు పోర్టు సమగ్ర ప్రాజెక్టు నివేదికకు ఆమోదం తెలుపుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నాన్ మేజర్ పోర్టుగా భావనపాడును నిర్మించేందుకు పాలనా అనుమతులు ఇచ్చింది. భావనపాడు పోర్ట్ డెవలప్​మెంట్ కార్పొరేషన్ ద్వారా పోర్టు నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. రూ.3669 కోట్ల వ్యయంతో పోర్టు మొదటి దశ నిర్మాణం పనులు చేపట్టాలని ఆదేశాల్లో ప్రభుత్వం పేర్కొంది. 36 నెలల్లో పోర్టు మొదటి దశ నిర్మాణ పనులు పూర్తి చేయాలని స్పష్టం చేసింది. మొదటి దశలో 500 ఎకరాల భూ సేకరణ కోసం 261 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయనుంది. మిగతా 2123 కోట్లను సమీకరించేందుకు మారిటైం బోర్డుకు ఆదేశాలు జారీ చేశారు.

ABOUT THE AUTHOR

...view details