ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 30, 2020, 5:14 AM IST

ETV Bharat / city

కరోనాకి భారత్​ బయోటెక్​ వ్యాక్సిన్​: క్లినికల్​ పరీక్షలకు డీసీజీఐ అనుమతి

కరోనా వ్యాధికి భారత్‌ బయోటెక్‌ కోవాగ్జిన్‌ పేరిట వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. దీనిపై మొదటి, రెండో దశ క్లినకల్‌ పరీక్షల నిర్వహణకు భారత ఔషధ నియంత్రణ మండలి అనుమతి ఇచ్చింది. ప్రీ క్లినికల్‌ అధ్యయనాల సమాచారాన్ని డీసీజీఐకు సమర్పించినట్టు, మొదటి, రెండో దశ పరీక్షలకు అనుమితి ఇచ్చినట్టు భారత్‌ బయోటెక్‌ పేర్కొంది.

bharat-biotech
కరోనాకి భారత్​ బయోటెక్​ వ్యాక్సిన్​: క్లినికల్​ పరీక్షలకు డీసీజీఐ అనుమతి

కరోనా వైరస్‌ను అరికట్టేందుకు కోవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ ఐసీఎంఆర్‌, పూనెలో నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ వైరాలజీ సహకారంతో భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ అభివృద్ధి చేస్తోంది. మొదటి, రెండోదశ క్లినికల్​ పరీక్షల నిర్వహణకు భారత ఔషధ నియంత్రణ మండలి అనుతిచ్చింది.

మొదటి, రెండో దశ పరీక్షలను మనుషులపై నిర్వహించనున్నారు. భారత్‌లో వచ్చే నెలలో ఇవి ప్రారంభమవుతాయని భారత్‌ బయెటెక్‌ వెల్లడించింది. ఇందులో భాగంగా సార్స్‌, కోవ్‌-2 వైరస్‌ స్ట్రెయిన్‌ను ఎన్‌ఐవీ, పూనె నుంచి భారత్‌ బయోటెక్‌కు బదిలీ చేశారు. అనంతరం హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్‌కు చెందిన లాబ్‌లో వ్యాక్సిన్‌ను తయారు చేశారు.

వ్యాక్సిన్‌ అభివృద్ధిపై భారత్‌ బయోటెక్ ఛైర్మన్‌ కృష్ణ ఎల్ల ఆనందం వ్యక్తం చేశారు. ప్రభుత్వ సంస్థల సహకారంతో పాటు భారత్‌ బయోటెక్‌ పరిశోధన, అభివృద్ధి విభాగం సిబ్బంది శ్రమ ఫలితంగానే వ్యాక్సిన్‌ తయారు చేసినట్టు వివరించారు. వ్యాక్సిన్​పై నిర్వహించిన పరీక్షల్లో ఆశాజనక ఫలితాలు వచ్చాయన్నారు. వీరో సెల్‌ కల్చర్‌ ప్లాట్‌ఫామ్‌ టెక్నాలజీస్‌ సాంకేతిక పరిజ్ఞనం ద్వారా పోలియో, రేబిస్‌, రొటావైరస్‌, జేఇ, చికెన్‌గున్యా, జికా వ్యాక్సిన్లను ఇప్పటి వరకు భారత్‌ బయోటెక్‌ ఆవిష్కరించింది.

ఇదీ చూడండి:గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో కరోనా ఉద్ధృతం

ABOUT THE AUTHOR

...view details