ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఐటీఐఆర్ అమలు కాకపోవడానికి కారణం.. ప్రభుత్వ వైఖరే' - telangana varthalu

ఐటీఐఆర్ ప్రాజెక్టు పై తెలంగాణ సీఎంకు ఆ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు బండి సంజయ్​ లేఖ రాశారు. ఐటీఐఆర్ అమలు కాకపోవడానికి కేసీఆర్ ప్రభుత్వ వైఖరే కారణమని ఆయన ఆరోపించారు. ఐటీఐఆర్‌ ఏర్పాటుకు రాష్ట్ర సర్కారు చర్యలు శూన్యమని సంజయ్​ విమర్శించారు.

bandi sanjay letter to cm kcr on itir project
ఐటీఐఆర్ ప్రాజెక్టుపై సీఎంకు లేఖ రాసిన బండి సంజయ్

By

Published : Mar 3, 2021, 10:22 AM IST

ఉద్యోగాల కల్పనపై తెలంగాణలో అధికార తెరాస, భాజపా మధ్య విమర్శలు కొనసాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లక్షా 30వేల ఉద్యోగాలు ఇచ్చామని చెబుతుండగా.. కమలనాథులు ఖండిస్తున్నారు. చర్చకు రావాలని సవాల్‌ విసురుతున్నారు. దీనికి ప్రతిగా ప్రధాని మోదీ ఇస్తానన్న ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాల హామీ ఏమైందంటూ గులాబీ నేతలు చురకలు అంటిస్తున్నారు. కేంద్రం తీరువల్లే ఐటీఐఆర్​ వంటి ప్రాజెక్టులు రాష్ట్రానికి దక్కకుండా పోయాయని విమర్శిస్తున్నారు.

అందుకు ప్రతిగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ముఖ్యమంత్రి కేసీఆర్​కు లేఖ రాశారు. ఐటీఐఆర్​ ప్రాజెక్టు అమలు కాకపోవడానికి ప్రభుత్వ వైఖరే కారణమని సంజయ్‌ ఆరోపించారు. సర్కారు వైఖరి వల్లే ప్రాజెక్టు రాలేదని కాగ్‌ కూడా చెప్పిందని అన్నారు. ఐటీఐఆర్‌పై తెరాస నేతలు రోజుకో ఉత్తరం రాస్తున్నారని.. తప్పుల్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఐటీఐఆర్‌ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వ చర్యలు శూన్యమని బండి పేర్కొన్నారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా సహాయ నిరాకరణ చేసిందని ఆయన ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details