ప్రభుత్వ దుర్మార్గానికి ఇది పరాకాష్ఠ: చంద్రబాబు - tweets
ఏఎన్ఎంలు తమ సమస్య చెప్పుకోడానికని వస్తే ముఖ్యమంత్రి పట్టించుకోలేదని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. వైకాపా ప్రభుత్వ దుర్మార్గానికి ఇది పరాకాష్ట అని మండిపడ్డారు.
babu
ముఖ్యమంత్రి సమస్యలు పట్టించుకోవట్లేది తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఏఎన్ఎంలు తమ గోడు చెప్పుకోవడానికి వస్తే పక్కనపెట్టారన్నారు. గత్యంతరంలేక ఆందోళనకు దిగిన మహిళలను బెదిరించడానికి వారి భర్తలను తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టడం ఏంటని ఆయన నిలదీశారు. న్యాయం చేయడం చేతకాకపోగా మహిళల పట్ల ఇంత కఠినంగా వ్యవహరిస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఎన్ఎం బాధితుల వీడియోను చంద్రబాబు ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
Last Updated : Aug 6, 2019, 2:56 PM IST