Azharuddin on Ind-Aus T20 match tickets: చాలా ఏళ్లకు హైదరాబాద్‌లో అంతర్జాతీయ మ్యాచ్ నిర్వహించే అవకాశం దక్కిందని హెచ్‌సీఏ ప్రతినిధులు పేర్కొన్నారు. క్రికెట్ ప్రేమికులు ఈ మ్యాచ్‌ను విజయవంతం చేయాలని కోరుతున్నామని హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్ తెలిపారు. మ్యాచ్‌కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేశామని ఆయన వెల్లడించారు. పేటీఎం ద్వారానే టిక్కెట్లు విక్రయించామని తెలిపారు. బ్లాక్‌లో టిక్కెట్లు అమ్మితే కఠినంగా వ్యవహరిస్తామని అజార్ పేర్కొన్నారు. బ్లాక్‌లో టిక్కెట్లు అమ్ముతున్నారనే వదంతులు ఎలా వచ్చాయో తమకు తెలియదన్నారు. బ్లాక్‌లో టిక్కెట్లు అమ్మేవారిపై పోలీసులు చర్యలు తీసుకుంటారని వివరించారు. టిక్కెట్ల విక్రయాల్లో హెచ్‌సీఏ నుంచి ఎలాంటి పొరపాట్లు జరగలేదని అజారుద్దీన్ సమర్థించుకున్నారు.
జింఖాన్ గ్రౌండ్స్‌లో నిన్న చోటు చేసుకున్న ఘటన చాలా బాధాకరమని హెచ్‌సీఏ ప్రతినిధులు పేర్కొన్నారు. బాధితులందరికీ హెచ్‌సీఏ తరఫున వైద్యం అందిస్తామని అజారుద్దీన్ తెలిపారు. టిక్కెట్ల విక్రయాల బాధ్యత పేటీఎంకు ఔట్ సోర్సింగ్ ఇచ్చామన్నారు. విక్రయానికి హెచ్‌సీఏకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు.