రాజ్‌భాషా హిందీని వరుసగా రెండో సంవత్సరం సమర్థవంతంగా అమలు చేసినందుకు దక్షిణ మధ్య రైల్వేకు టోలిక్ రాజ్‌భాషా షీల్డ్, బెస్ట్ ఇన్-హౌస్ మ్యాగజైన్ అవార్డు లభించింది. దక్షిణ మధ్య రైల్వే టౌన్ అధికారిక భాష అమలు కమిటీకి రాజ్‌భాషా షీల్డ్, ఉత్తమ అంతర్గత మ్యాగజైన్ అవార్డును హైదరాబాద్ బేగంపేటలోని అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఫర్ ఎక్స్‌ప్లోరేషన్ అండ్ రీసెర్చ్‌లో జరిగిన కార్యక్రమంలో అందజేశారు.
దక్షిణ మధ్య రైల్వేకు ప్రతిష్ఠాత్మక అవార్డు - telangana varthalu
రాజ్‌భాషా హిందీని రెండో సంవత్సరం సమర్థవంతంగా అమలు చేసినందుకు దక్షిణ మధ్య రైల్వేను అవార్డు వరించింది. టోలిక్ రాజ్‌భాషా షీల్డ్, బెస్ట్ ఇన్-హౌస్ మ్యాగజైన్ అవార్డు లభించింది.
prestigious award to south central railway
ముఖ్య అతిథిగా ప్రిన్సిపల్ ఫైనాన్స్ అడ్వైజర్ బ్రజేంద్ర కుమార్, దక్షిణ మధ్య రైల్వే ముఖ్య రాజ్‌భాషా అధికారి హాజరయ్యారు. ఈ సందర్భంగా వర్చువల్ మాధ్యమంలో నిర్వహించిన వివిధ హిందీ పోటీల విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు.
ఇదీ చూడండి: పాక్‌పై 1971 విజయానికి 50 ఏళ్లు.. నేవీ ప్రత్యేక వీడియో