ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

డ్రోన్ల ద్వారా టీకాల పంపిణీకి కేంద్రం కసరత్తు - డ్రోన్ల ద్వారా టీకాలు

ఇక డ్రోన్ల ద్వారా టీకాలు అందించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. ఐసీఎంఆర్‌కు సంబంధిత అనుమతులు మంజూరు చేసింది కేంద్ర పౌర విమానయాన శాఖ.

drones
drones

By

Published : Sep 14, 2021, 1:23 PM IST

మారుమూల ప్రాంతాలకు కొవిడ్‌ వ్యాక్సిన్లను చేరవేసే లక్ష్యంతో... డ్రోన్ల ద్వారా వాటిని రవాణా చేయాలని కేంద్ర పౌర విమానయానశాఖ నిర్ణయించింది. అండమాన్‌, నికోబార్‌ ద్వీపాలతో పాటు మణిపుర్‌, నాగాలాండ్‌లోని మారుమూల ప్రాంతాలకు... డ్రోన్ల ద్వారా వ్యాక్సిన్లను తీసుకువెళ్లేలా భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌)కి షరతులతో కూడిన అనుమతులు మంజూరు చేసింది.

గరిష్ఠంగా 3 వేల మీటర్ల ఎత్తులో మాత్రమే ఈ డ్రోన్లను నడపాలని స్పష్టం చేసినట్టు సోమవారం వెల్లడించింది. పౌర విమానయానశాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఇటీవల తెలంగాణలో ‘డ్రోన్ల ద్వారా ఔషధాల సరఫరా’ ప్రాజెక్టును ప్రారంభించిన క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం.

ఇదీ చదవండి :కృష్ణంరాజు ఆరోగ్యంపై కుటుంబసభ్యుల కీలక ప్రకటన

ABOUT THE AUTHOR

...view details