ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఉద్యోగులు చనిపోయినా ముఖ్యమంత్రిలో చలనం లేదు: అచ్చెన్నాయుడు

సచివాలయంలో ఎనిమిది మంది ఉద్యోగులు చనిపోయినా.. సీఎం జగన్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యం కారణంగానే వందలాది మంది ఉద్యోగులకు కరోనా సోకిందని ధ్వజమెత్తారు. ఉద్యోగులందరికీ ఇంటినుంచి పనిచేసే వెసులుబాటు కల్పించాలని డిమాండ్ చేశారు.

అచ్చెన్నాయుడు
అచ్చెన్నాయుడు

By

Published : Apr 29, 2021, 6:54 PM IST

సచివాలయంలో ఎనిమిది మంది ఉద్యోగులు చనిపోయినా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పట్టనట్లు వ్యవహరిస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. కరోనాతో సాధారణ పరిపాలన శాఖలో డేటా ఎంట్రీ ఆపరేటర్ కిషోర్ కుమార్ మృతి చెందడం బాధాకరమని పేర్కొన్నారు. రెండోదశలో సచివాలయ ఉద్యోగులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పనిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యం కారణంగానే వందలాది మంది ఉద్యోగులకు కరోనా సోకిందని ధ్వజమెత్తారు. ప్రజలు, ఉద్యోగులు కరోనాతో మరణిస్తున్నా.. ఎలాంటి నివారణ చర్యలు చేపట్టడం లేదని ఆక్షేపించారు. సచివాలయ ఉద్యోగులందరికీ ఇంటినుంచి పనిచేసే వెసులుబాటు కల్పించాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details