కమీషన్ల కక్కుర్తితో నాడు-నేడు పేరిట హడావిడి చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్యను దూరం చేయటంతోనే విద్యానాణ్యతలో 3వ స్థానం నుంచి 19వ ర్యాంకుకు ఏపీ పడిపోయిందని.. తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు(Atchannaidu) ధ్వజమెత్తారు. పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణంలోనూ 3 శాతం వెనుకబడ్డారని తెలిపారు. సుస్థిరాభివృద్ధికి తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి రాష్ట్రాన్ని మూడో స్థానంలో నిలిపిందని గుర్తు చేశారు.
సుస్థిరాభివృద్ధి లక్ష్య సాధనలో వైకాపా ప్రభుత్వం విఫలం: అచ్చెన్నాయుడు - AP News
సుస్థిరాభివృద్ధి లక్ష్య సాధనలో వైకాపా ప్రభుత్వం విఫలమైనందుకే నీతి ఆయోగ్ (Niti Aayog) నివేదికలో ఆంధ్రప్రదేశ్ 4వ స్థానానికి పడిపోయిందని.. తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు విమర్శించారు. విద్య, మౌలిక సదుపాయాలు, న్యాయం, ఇతరత్రా కీలక రంగాల్లో రాష్ట్ర పరిస్థితి ఘోరంగా ఉందన్నారు.
గతేడాదితో పోల్చితే ఈ ఏడాది 0.2 శాతం లోటు నమోదైందని అచెన్నాయుడు వెల్లడించారు. ఉపాధి హామీ నిధుల వినియోగంలోనూ రాష్ట్రం వెనుకబడిందన్న అయన.. సామాన్యులు, కింద వర్గాలు గౌరవప్రదంగా పని చేసుకునే వాతావరణం రాష్ట్రంలో లేదని మండిపడ్డారు. గౌరవ ప్రదమైనపని, న్యాయ వ్యవస్థల కేటగిరిలో 2వ స్థానంలో ఉన్న రాష్ట్రం 6, 9 స్థానాలకు పడిపోయిందన్నారు. వ్యవస్థల్ని నాశనం చేస్తూ... రాజారెడ్డి రాజ్యాంగం నడుపుతున్నారనటానికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. అసలు లెక్కలను దాచిన వైకాపా నేతలు.. అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు.
ఇదీ చదవండీ... Amul project: 'పాదయాత్రలో పాడి రైతుల కష్టాలు చూశా.. అమూల్ ప్రాజెక్ట్‌ను తీసుకొచ్చా'