ASSEMBLY MEETINGS: రాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను ఈ నెల చివరి వారంలో నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అయిదు పని దినాలు ఉండేలా సమావేశాలను నిర్వహించనున్నారు. రాష్ట్రపతి ఎన్నిక ఉన్నందున పోలింగ్ తేదీలను దృష్టిలో ఉంచుకొని అసెంబ్లీ సమావేశాల తేదీలను ఖరారు చేయనున్నారు. ఈ సమావేశాల్లో సుమారు 10 కీలక బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నట్లు తెలిసింది. వైకాపా ప్రభుత్వం ఏర్పాటై మూడేళ్లు పూర్తయిన నేపథ్యంలో చేపట్టిన పనులు, అమలు చేసిన పథకాలపై ముఖ్యమంత్రి జగన్ సభలో ప్రసంగించనున్నారు. శాసనసభ ఉప సభాపతి ఎన్నిక ప్రక్రియనూ ఇదే సమావేశాల్లో పూర్తి చేయనున్నారు.
ASSEMBLY MEETINGS: ఈ నెల చివరి వారంలో.. అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు..! - ఈ నెల చివరి వారంలో అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
ASSEMBLY MEETINGS: అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను ఈ నెల చివరి వారంలో నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. రాష్ట్రపతి ఎన్నిక ఉన్నందున పోలింగ్ తేదీలను దృష్టిలో ఉంచుకొని అసెంబ్లీ సమావేశాల తేదీలను ఖరారు చేయనున్నారు.
ASSEMBLY MEETINGS