శాసనసభ ఫర్నీచర్ తరలింపు వ్యవహారంలో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. అసెంబ్లీ చీఫ్ మార్షల్ వి.గణేష్‌బాబుపై బదిలీ వేటు వేసింది. డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశాలు జారీ చేశారు. ఆయన మాతృశాఖ ఆక్టోపస్‌కు తిరిగి పంపిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆదేశాలు తక్షణం అమల్లోకి వస్తాయని డీజీపీ తెలిపారు. ఈ మేరకు మంగళగిరిలోని ఆక్టోపస్ ఎస్పీకి గణేష్ రిపోర్టు చేశారు. ఆక్టోపస్‌లో అసిస్టెంట్ కమాండెంట్ హోదాలో ఉన్న గణేష్ బాబు చాలా కాలంగా శాసన సభ సచివాలయ చీఫ్ మార్షల్‌గా బాధ్యతలు నిర్వహించారు.
ఫర్నీచర్ వ్యవహారం... అసెంబ్లీ చీఫ్ మార్షల్‌పై వేటు - assembly
అసెంబ్లీ ఫర్నీచర్ తరలింపు వ్యవహారం మీద అంతర్గత విచారణ కొనసాగుతోంది. శాసనసభ చీఫ్ మార్షల్ గణేశ్ బాబును ప్రభుత్వం బదిలీ చేసింది.
అందుకే వేటు
శాసన సభాపతిగా ఉన్న సమయంలో కోడెల శివప్రసాద్ హైదరాబాద్‌లోని అసెంబ్లీకి చెందిన ఫర్నీచర్‌ను తరలించారు. వెలగపూడికి కాకుండా కోడెల క్యాంపు కార్యాలయానికి ఫర్నీచర్‌ను తీసుకువెళ్లారు. ఈ వ్యవహారంపై ప్రస్తుత శాసన సభాపతి తమ్మినేని సీతారాం డీజీపీకి ఫిర్యాదు చేయగా.. కొద్ది రోజులుగా పోలీసులు విచారణ చేస్తున్నారు. తరలింపు వ్యవహారంలో గణేష్ బాబు పాత్ర ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలడం వల్లే వేటు వేసినట్లు వైకాపా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ వ్యవహారంలో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు సహా అధికారుల ప్రమేయంపై విచారణ జరుగుతుందని ఆయన అన్నారు. కోడెల కుమారుడికి చెందిన హీరోహోండా షో రూంలో ఫర్నీచర్ ఉంచి క్యాంపు కార్యాలయంలో ఉన్నట్లు తప్పుగా చెబుతున్నారని అన్నారు. ఈ ఉదంతం బయటకు వచ్చాకే కోడెల లేఖ రాసినట్లు నటించారని ఆరోపించారు. కోడెల కుటుంబం చేసిన అక్రమాలపై సిట్ లేదా సీబీసీఐడీతో దర్యాప్తునకు ప్రభుత్వాన్ని కోరతామన్నారు.