ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మాన్సాస్‌ ట్రస్టు వ్యవహారంపై హైకోర్టుకు అశోక్‌ గజపతిరాజు - మన్సాస్ ట్రస్ట్

మాన్సాస్‌ ట్రస్టు వ్యవహారం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ట్రస్టు ఛైర్‌పర్సన్‌గా సంచైత గజపతిరాజుని ప్రభుత్వం నియమించడాన్ని సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు అశోక్‌గజపతిరాజు.

high court
మాన్సాస్‌ ట్రస్టు వ్యవహారంపై హైకోర్టుకు అశోక్‌గజపతిరాజు

By

Published : Mar 11, 2020, 5:22 AM IST

మాన్సాస్‌ ట్రస్టు వ్యవహారంపై హైకోర్టుకు అశోక్‌గజపతిరాజు

విజయనగరం జిల్లా మాన్సాస్ ట్రస్టు ఛైర్‌పర్సన్‌గా సంచైత గజపతిరాజుని నియమించడాన్ని సవాల్‌ చేస్తూ... ట్రస్టు పూర్వ ఛైర్మన్‌ అశోక్‌గజపతి రాజు హైకోర్టును ఆశ్రయించారు. ట్రస్టు వ్యవస్థాపక కుటుంబసభ్యులుగా ఆమెతో పాటు, ఊర్మిళా గజపతిరాజు, ఆర్వీ సునీతను నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోనూ ఆయన సవాల్ చేశారు. జీవో నంబర్‌ 74, 78 అమలును నిలిపివేయాలని కోరారు. ట్రస్టు ఏర్పాటు సమయంలో 1958లో రాసిన దస్తావేజుకు విరుద్ధంగా తాజా నియమకాలున్నాయన్నారు. కుటుంబంలో పెద్దవాళ్లైన పురుషులే ఛైర్మన్ లేదా అధ్యక్షుడిగా ఉండాలన్నారు. రొటేషన్ పద్ధతిలో సంచైతను ఛైర్‌పర్సన్‌గా నియమించినట్టు ప్రభుత్వం జీవోల్లో పేర్కొందన్నారు. ట్రస్టు బైలాస్‌లో ఆ పదమే లేదని ఆయన స్పష్టం చేశారు. సంబంధిత ఉన్నతాధికారులను తన వ్యాజ్యంలో ప్రతివాదులుగా అశోక్‌గజపతిరాజు పేర్కొన్నారు.

ఇవీ చూడండి-అమలులో ఎన్నికల కోడ్.. చేయకూడని పనులు ఇవే!

ABOUT THE AUTHOR

...view details