ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'రాజకీయ లబ్ధి కోసమే పారిశ్రామిక ప్రోత్సాహకాలు' - వైకాపా ప్రభుత్వంపై అశోక్ బాబు

రాజకీయ లబ్ధి కోసమే వైకాపా ప్రభుత్వం పారిశ్రామిక ప్రోత్సాహకాలు విడుదల చేసిందని ఎమ్మెల్సీ అశోక్ బాబు అన్నారు. ఈ ఏడాది కాలంలో వైకాపా ప్రభుత్వం పరిశ్రమల కోసం ఏమి చేశారో శ్వేత పత్రం విడుదల చేయాలని అశోక్ బాబు డిమాండ్ చేశారు.

ashok babu on industrial insentives
పారిశ్రామిక ప్రోత్సాహకాలపై ఎమ్మెల్సీ అశోక్ బాబు

By

Published : Jun 29, 2020, 6:20 PM IST

ప్రభుత్వం విడుదల చేసిన పారిశ్రామిక ప్రోత్సాహకాల వెనుక రాజకీయ లబ్ధి ఉందని తెదేపా ఎమ్మెల్సీ అశోక్ బాబు అన్నారు. తెదేపా ఎమ్మెల్యే మద్దాలి గిరి పరిశ్రమకు సంబంధించి రూ. 8 కోట్లు పెండింగ్​లో పెట్టి.. పార్టీలో చేర్చుకున్నాక వాటిని విడుదల చేశారని ఆయన ఆరోపించారు.

2014-2019 మధ్య రూ.3,625 కోట్లు పారిశ్రామిక ప్రోత్సాహకాలు విడుదలయ్యాయని ఎమ్మెల్సీ అశోక్ బాబు గుర్తు చేశారు. తాజా ప్రోత్సాహకాలు తెలుగుదేశం ప్రభుత్వం పెట్టిన పారిశ్రామిక విధానంలోవే తప్ప కొత్త పారిశ్రామిక విధానాన్ని ప్రస్తుత ప్రభుత్వం ప్రకటించలేదన్నారు. అసలు పరిశ్రమలకు ఈ ఏడాది కాలంలో ఏమి చేశారో శ్వేత పత్రం విడుదల చేయాలని ప్రభుత్వాన్ని అశోక్ బాబు డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి: నన్ను తప్పించేందుకు స్కెచ్ వేశారు: ఈటీవీ భారత్​తో రఘురామకృష్ణరాజు

ABOUT THE AUTHOR

...view details