పోలీసులకు చెల్లించాల్సిన బకాయిలపై ప్రభుత్వం స్పందించడం లేదంటూ అనంతపురం జిల్లాకు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాష్ మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. అనంతపురంలోని పోలీసు కార్యాలయ ఆవరణలో పోలీసు అమరవీరుల స్తూపం వద్ద ‘ఏపీ సీఎం జగన్ సార్.. సేవ్ ఏపీ పోలీస్, గ్రాంట్ ఎస్‌ఎల్‌ఎస్, ఏఎస్‌ఎల్‌ఎస్ అరియర్స్.. సామాజిక న్యాయం ప్లీజ్’ అంటూ ప్లకార్డు ప్రదర్శించారు. తమకు మూడు సరెండర్ లీవ్స్, అదనపు సరెండర్ లీవ్స్‌కు సంబంధించిన మొత్తం రాలేదన్నారు. పోలీసులకు 14 నెలలకు సంబంధించి రవాణా భత్యం, ఆరు డీఏ బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. ప్రభుత్వం బకాయిలు చెల్లించినట్లు ఆడిట్‌లో చూయించి వాటిపై పన్ను వసూలు చేశారని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది పోలీసులు ఈ విషయమై ఆవేదన చెందుతున్నారని పేర్కొన్నారు.
AP Police: సేవ్ ఏపీ పోలీస్.. ప్లకార్డుతో ఏఆర్ కానిస్టేబుల్ నిరసన
‘ఏపీ సీఎం జగన్ సార్.. సేవ్ ఏపీ పోలీస్, గ్రాంట్ ఎస్‌ఎల్‌ఎస్, ఏఎస్‌ఎల్‌ఎస్ అరియర్స్.. సామాజిక న్యాయం ప్లీజ్’ అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఏఆర్ కానిస్టేబుల్ నిరసన వ్యక్తం చేశారు. పోలీసులకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
ప్లకార్డుతో ఏఆర్ కానిస్టేబుల్ నిరసన