వివిధ రీజియన్లకు సంబంధించి దినపత్రికల్లో నోటీసులు, నోటిఫికేషన్లు ప్రచురించేందుకు నూతన ఏజెన్సీ నియామకం కోసం ఆర్టీసీ టెండర్లు ఆహ్వానించింది. ఇప్పటికే ఉన్న ఏజెన్సీ కాలపరిమితి ముగియడం వల్ల నూతన ఏజెన్సీ కోసం టెండర్లు పిలిచారు.
రాష్ట్ర ప్రభుత్వ సమాచార పౌర సంబంధాలశాఖ వద్ద ఎంపానల్ అయిన యాడ్ ఏజెన్సీలు టెండర్లు దాఖలు చేయవచ్చని ఆర్టీసీ తెలిపింది. ఆసక్తి ఉన్న వారు ఈ నెల 15వ తేదీ మధ్యాహ్నం 2 గంటల్లోపు టెండర్ దాఖలు చేయాలని సూచించారు. పూర్తి వివరాల కోసం ఆర్టీసీ పబ్లిక్ రిలేషన్స్ విభాగాన్ని సంప్రదించాలని తెలిపారు.