లాక్‌డౌన్‌తో హైదరాబాద్‌లో ఉండిపోయిన రాష్ట్ర ప్రజల కోసం ఏపీఎస్‌ఆర్టీసీ నడిపే బస్సులు రేపట్నుంచి ప్రారంభం కానున్నట్లు అధికారులు తెలిపారు. స్పందన పోర్టల్‌లో నమోదైన వారికే ప్రయాణ అవకాశం ఇవ్వనున్నారు. ఏసీ, నాన్ ఏసీ బస్సుల్లో ఛార్జీ ఎంత? ఆన్‌లైన్ రిజర్వేషన్ ఎన్ని గంటలకు మొదలవుతుందనే విషయాన్ని నేడు ప్రకటించనున్నారు. ప్రతి జిల్లా నుంచి పది చొప్పున 130 బస్సులు నడపనున్నారు.
హైదరాబాద్ నుంచి రేపు రాష్ట్రానికి బస్సులు ప్రారంభం - లాక్ డౌన్ వార్తలు
రేపట్నుంచి రాష్ట్రానికి హైదరాబాద్ నుంచి బస్సులు ప్రారంభం కానున్నాయి. లాక్ డౌన్‌తో హైదరాబాద్‌లో ఉండిపోయిన రాష్ట్ర ప్రజల కోసం ఏపీఎస్‌ఆర్టీసీ బస్సులను నడపనుంది.స్పందన పోర్టల్‌లో నమోదైన వారికే ప్రయాణ అవకాశం ఇవ్వనున్నారు.
దిల్లీ నుంచి తెలుగు రాష్ట్రాలకు..
దేశ రాజధాని దిల్లీ నుంచి సుమారు 120 మంది నాలుగు బస్సుల్లో గురువారం ఉదయం తెలుగు రాష్ట్రాలకు బయల్దేరారు. ఏపీ, తెలంగాణ భవన్ భద్రతా సిబ్బందితోపాటు ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రుల అధికారిక నివాసాల వద్ద విధులు నిర్వర్తించే వారంతా ఈ బస్సుల్లో బయల్దేరారు. నిజామాబాద్ మీదుగా హైదరాబాద్ చేరుకొనే ఈ బస్సుల్లో ఏపీకి చెందిన వారూ ఉన్నారు. ఏపీకి చెందిన వారి బస్సులకు అనుమతి వస్తే విజయవాడ లేకపోతే హైదరాబాద్‌కు వెళ్లనున్నట్లు సమాచారం.