పండుగ రద్దీ దృష్ట్యా ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు బస్సులను నడపనుంది. రెగ్యులర్ సర్వీసులకు అదనంగా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు ఏపీఎస్ఆర్టీసీ తెలిపింది. హైదరాబాద్ నుంచి 110, బెంగళూరు నుంచి 30, చెన్నై నుంచి 10 ప్రత్యేక బస్సులు సేవలందించనున్నాయి. ప్రత్యేక బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ సదుపాయం ఉందని అధికారులు తెలిపారు.
దసరా పండుగకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు - apsrtc bus running status
దసరా పండుగ సందర్భంగా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రత్యేక బస్సులను నడపనుంది. ప్రత్యేక బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ చేసుకునే వీలుందని అధికారులు తెలిపారు.
పండుగకు ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు