ఈ నెల, వచ్చే నెలలో నిర్వహించాల్సిన పలు మెయిన్స్ పరీక్షలను ఏపీపీఎస్సీ వాయిదా వేసింది. పరిపాలన పరమైన కారణాలతో మెయిన్స్ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి సీతారామాంజనేయులు తెలిపారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, గెజిటెడ్, నాన్ గెజిటెడ్ పోస్టులు, పాలిటెక్నిక్, డిగ్రీ కళాశాలల లెక్చరర్ల నియామకానికి అక్టోబర్, నవంబర్ నెలల్లో మెయిన్స్ నిర్వహించాల్సి ఉండగా... వాయిదా వేశారు.
మెయిన్స్ పరీక్షలు వాయిదా... ఏపీపీఎస్సీ ప్రకటన - appsc jobs
ఈ నెల, వచ్చే నెలలో నిర్వహించాల్సిన పలు మెయిన్స్ పరీక్షలను ఎపీపీఎస్సీ వాయిదా వేసింది. పరీక్షల నిర్వహణ తేదీలను ఈనెల 22న ప్రకటిస్తామని ఏపీపీఎస్సీ కార్యదర్శి సీతారామాంజనేయులు తెలిపారు.
ఎపీపీఎస్సీ మెయిన్స్ పరీక్షలు వాయిదా
పరీక్షల నిర్వహణ తేదీలను ఈనెల 22న ప్రకటిస్తామని సీతారామాంజనేయులు తెలిపారు. నవంబర్ సెషన్‌కు సంబంధించి డిపార్టుమెంట్ పరీక్షలకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. బుధవారం నుంచి ఈనెల 28 వరకు దరఖాస్తు చేసేందుకు అవకాశం కల్పించారు. దరఖాస్తు చేసే వారు ఈ నెల 27లోపు పరీక్ష ఫీజు చెల్లించాలి. నవంబర్ 14నుంచి 19 వరకు ఆన్లైన్లో డిపార్టుమెంట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ తెలిపింది.
ఇదీ చదవండీ... 'వైకాపా ప్రభుత్వం... వాయిదాల ప్రభుత్వం'
Last Updated : Oct 16, 2019, 10:02 AM IST