ఇదీ చూడండి..
నూతన పారిశ్రామిక విధానం.. ఉపాధి కల్పనే లక్ష్యం: రోజా
ఉద్యోగాలు, ఉపాధి కల్పన ఆధారంగా విద్యుత్ సబ్సిడీలు, ప్రోత్సాహకాలు కల్పించే విధంగా నూతన పారిశ్రామిక విధానం రూపొందించామని ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్ రోజా తెలిపారు. రాష్ట్రానికి పారిశ్రామికవేత్త జగన్ ముఖ్యమంత్రిగా, గౌతమ్ రెడ్డి పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నందునే పరిశ్రమలకనుగుణంగా ఉండే కొత్త విధానం తీసుకొచ్చామని చెప్పారు. గతంలో ఈ తరహా వాస్తవిక విధానం లేదన్నారు. గత ప్రభుత్వం కాఫీషాపులో వ్యక్తికి సూటు వేసి ఒప్పందాలు చేసుకున్నారని విమర్శించారు. నూతన పారిశ్రామిక విధానంలో ఎవరికీ ఆయాచిత లబ్ది కలగదని.. పునాది వేయని పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇవ్వమని స్పష్టం చేశారు. నూతన పారిశ్రామిక విధానంపై ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్ రోజాతో ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి..
నూతన పారిశ్రామిక విధానం.. ఉపాధి కల్పనే లక్ష్యం: రోజా