ఆంధ్రప్రదేశ్ భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ మండలి నిధులను గత ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని.. ఏపీ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ సంఘం సభ్యులు గవర్నర్ బిశ్వభూషణ్‌కు ఫిర్యాదు చేశారు. ప్రస్తుత ప్రభుత్వమూ ఈ విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. భవన నిర్మాణ కార్మికుల హక్కులు పరిరక్షించి సంక్షేమ మండలి నిధుల దారి మళ్లింపుపై సీబీఐతో విచారణ చేయించాలని కోరారు. కేంద్రప్రభుత్వం 'ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన' పథకం ద్వారా 1200 కోట్ల రూపాయలు ఇస్తే.. వాటిలో 900 కోట్లు దారి మళ్లించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వైకాపా ప్రభుత్వం పథకం పేరు మార్చి నిధులను పక్కదారి పట్టిస్తుందన్నారు.
"నిధుల దారి మళ్లింపుపై సీబీఐతో విచారణ జరగాలి" - governor
ఆంధ్రప్రదేశ్ భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ మండలి బోర్డులో 3 వేల కోట్ల నిధులు ఉన్నాయనీ.. వాటి ఖర్చులు తేల్చి శ్వేతపత్రం విడుదల చేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని.. భవన నిర్మాణ కార్మిక సంక్షేమ సంఘం సభ్యులు గవర్నర్‌కు నివేదించారు.
గవర్నర్‌కు 'ఏపీ భవన నిర్మాణ సంక్షేమ మండలి సభ్యుల' వినతిపత్రం