ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

9AM AP TOP NEWS - ap top ten news

.

top news
top news

By

Published : Aug 15, 2022, 9:02 AM IST

  • స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం..
    76వ స్వాతంత్య్ర వేడుకలకు రాష్ట్రం ముస్తాబైంది. విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ మైదానంలో సీఎం జాతీయ జెండా ఎగరవేయనున్నారు. గుంటూరులో జరిగే వేడుకల్లో తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు పాల్గొంటారు. స్వాతంత్ర్యోత్సవ వేళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ భవనాలు, వివిధ కూడళ్లను విద్యుత్‌ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • రాష్ట్ర డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డికి రాష్ట్రపతి ఉత్తమ పోలీస్‌ సేవా పతకం..
    రాష్ట్ర డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డికి రాష్ట్రపతి ఉత్తమ పోలీస్‌ సేవా పతకం లభించింది. ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’ వేడుకల వేళ కేంద్ర హోం శాఖ ఈ అవార్డును ప్రకటించింది. విధి నిర్వహణలో ఉత్తమ సేవలందించినందుకు ఉత్తమ సేవలు–2020 సంవత్సరానికి ఈ పురస్కారం దక్కింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • రాష్ట్ర డిస్కంలను రెడ్‌ కేటగిరీలో చేర్చిన కేంద్ర ప్రభుత్వం
    రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థలు- డిస్కంలను... కేంద్ర ప్రభుత్వం రెడ్‌ కేటగిరీలో చేర్చింది. వివిధ ఉత్పత్తి సంస్థల నుంచి తీసుకున్న విద్యుత్‌కు చెల్లించాల్సిన 11వేల 149 కోట్లు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉంచడమే ఈ చర్యకు కారణమైంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • మావోయిస్టుల కోటలో ఎగిరిన మువ్వన్నెల జెండా
    స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఏటా అక్కడ నల్ల జెండాలు ఎగిరేవి. అందుకు భిన్నంగా తొలిసారిగా ఈ ఏడాది జాతీయ జెండాలు రెపరెపలాడాయి. అక్కడి గిరిజనులతో పాటు సరిహద్దు పోలీసు బలగాలు ‘ఆజాదీకా అమృత్‌ మహోత్సవాలు’ సందడిగా నిర్వహించాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
    స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు, దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • నవ సంకల్పంతో, సరికొత్త దారిలో ప్రయాణించే సమయం ఆసన్నమైందన్న మోదీ
    భారత ప్రజానీకం నవచేతనతో ముందడుగు వేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దేశం ఎవరికీ తలవంచదని, ఎన్ని సవాళ్లు ఎదురైనా ముందుకెళ్తూనే ఉంటుందని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • తెలుగు వెండితెరపై స్వరాజ్య గళం..
    కులం, మతం, ప్రాంతం అనే భేదం లేకుండా అందరినీ ఒకే స్థాయిలో కదిలించే ఓ గొప్ప భావోద్వేగం దేశభక్తి. అందుకే మాతృభూమి గురించి, స్వరాజ్యం గురించి స్పృశించే ఏ చిన్న అవకాశం వచ్చినా వదలుకోదు మన సినిమా. ఎన్నెన్ని కథలుగా చెప్పినా తరగని పోరాటాలు, ప్రాణ త్యాగాలతో కూడిన గొప్ప ఉద్యమ చరిత్ర మనది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఇక మినహాయింపులు లేకుండా కొత్త ఆదాయపు పన్ను విధానం
    ఆదాయపు పన్ను చెల్లింపులకు కొత్త విధానాన్ని ప్రవేశపెట్టే యోచనలో ఉంది ప్రభుత్వం. ప్రస్తుత విధానం కాకుండా మినహాయింపులు లేని కొత్త పన్ను విధానం లోకి అత్యధికులను ఆకర్షించేందుకు ఆర్థిక శాఖ సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. వ్యక్తిగత పన్ను చెల్లింపుదార్లలో ఎక్కువ మంది కొత్త పన్ను విధానానికి మారేందుకు వీలుగా ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • హమారా క్రీడా మహాన్‌, ఆటల్లో దూకుడు కొనసాగిస్తే భవిష్యత్ మనదే
    దేశ క్రీడాకారులు మన సత్తాను ప్రపంచానికి ఎలుగెత్తి చాటారు. భారత స్వాతంత్య్ర అమృత మహోత్సవాల సందర్భంగా ఓ సారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఇప్పటివరకు క్రీడల్లో గణనీయమైన పురోగతి కనిపిస్తోంది. అయినా సాగించాల్సిన ప్రయాణం.. చేరాల్సిన గమ్యం ఇంకా ఎంతో దూరం ఉంది. 21వ శతాబ్దం ఆరంభం నుంచి ఆటల్లో మన దూకుడు పెరిగింది.. ఇదే జోరు కొనసాగిస్తే భవిష్యత్‌ మనదే! పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఉక్రెయిన్‌లో సమాధులను తవ్వుతున్న ప్రజలు, అసలేమైంది
    Ukraine Crisis Ukraine Crisis ఉక్రెయిన్​లోని లుహాన్స్క్​ ప్రాంత ప్రజలు సమాధులు తవ్వుతున్నారు. తమ కుటుంబీకుల మృతదేహాలను వెలికితీసి గౌరవప్రదంగా మరోసారి అంతిమ సంస్కారాలు జరుపుతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details