ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 3PM - ap top ten news

.

ap topnews
ap topnews

By

Published : Aug 1, 2022, 3:00 PM IST

  • 'రికవరీ ఏజెన్సీలు నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు'
    ఎన్టీఆర్ జిల్లా నందిగామలో హరిత ఆత్మహత్య కేసును పోలీసులు ఛేదించారు. ఎంఎస్‌ఆర్‌, ఎస్‌ఎల్‌వీ రికవరీ ఏజెన్సీకి చెందిన ఏడుగురు అరెస్టు అరెస్టు చేసిన పోలీసులు... వైద్య పరీక్షల నిమిత్తం నందిగామ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రికవరీ ఏజెన్సీలు నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని డీసీపీ మేరీ ప్రశాంతి హెచ్చరించారు. నిబంధనలకు లోబడి ఏజెన్సీలు, బ్యాంకులు వ్యవహరించాలన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • చైన్‌స్నాచింగ్‌ను ప్రతిఘటించిన మహిళ.. పాపను లాక్కొని నీటిసంపులో పడేసి..
    ఓ మహిళ తన సంవత్సరం వయసున్న కూతురితో బయటికి వెళ్లింది. రోడ్డుమీద ఒంటరిగా వెళ్తున్న స్త్రీ మెడలో ఉన్న బంగారు గొలుసుపై ఓ దుండగుడి చూపు పడింది. ఎలాగైనా దానిని సొంతం చేసుకోవాలనే ఆలోచనతో ఉన్న ఆ క్రూరుడు ఆమెపై దాడికి యత్నించాడు. అప్రమత్తమైన మహిళ చేతిలో కూతురిని ఉంచుకునే అతడిని ఎదుర్కొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • కేంద్రం నుంచి చంద్రబాబుకు ఆహ్వానం.. అందులో పాల్గొనాలని విజ్ఞప్తి..
    "ఆజాదీ కా అమృత్ మహోత్సవ్" ఉత్సవాల జాతీయ కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఈ నెల 6న దిల్లీ వెళ్లనున్నారు. ఈమేరకు కేంద్ర ప్రభుత్వం ఆయనకు ఆహ్వానం పంపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో ముగ్గురి బెయిల్‌ పిటిషన్లు కొట్టివేత..
    వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో బెయిల్​ పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. ముగ్గురు నిందితుల బెయిల్​ పిటిషన్​ను ధర్మాసనం కొట్టేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • సంజయ్ రౌత్ ఇంటి నుంచి నగదు స్వాధీనం.. ప్రత్యేక కవర్​లో రూ.10 లక్షలు!..
    Sanjay raut ED: పాత్రాచాల్ కుంభకోణం కేసులో శివసేన ఎంపీ సంజయ్ రౌత్​ను ఈడీ ఆదివారం అరెస్టు చేశారు. సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు.. రౌత్ ఇంట్లో రూ.11.50 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అందులో రూ.10 లక్షలను ప్రత్యేకంగా ఒక కవర్‌లో ఉంచినట్లు వారు గుర్తించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • దళిత మహిళపై లైంగిక వేధింపులు.. తుపాకీతో బెదిరించి..
    గడ్డి కోసేందుకు పొలానికి వెళ్లిన ఓ దళిత మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు ఏడుగురు దుండగులు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • షూటింగ్స్ బంద్​పై గందరగోళం.. కొనసాగుతున్న స్టార్ హీరోల సినిమాలు..
    తెలుగు సినిమా షూటింగ్స్ బంద్​పై గందరగోళం సాగుతోంది. ఫిల్మ్ చాంబర్ నిర్ణయానికి వ్యతిరేకంగా పలువురు నిర్మాతలు షూటింగ్స్ కొనసాగిస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • స్టన్నింగ్​​ క్యాచ్​.. ఒంటిచేత్తో అవలీలగా.. వీడియో వైరల్​..
    ఇంగ్లాండ్​తో జరిగిన మూడో టీ20లో దక్షిణాఫ్రికా ప్లేయర్​ ట్రిస్టన్​ స్టబ్స్​ అద్భుత క్యాచ్​తో మెరిశాడు. కళ్లు చెదిరే రీలితో ఒంటిచేత్తో బంతిని పట్టుకుని అబ్బురపరిచాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్​మీడియాలో వైరల్​ అవుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు.. గతేడాది కన్నా 28 శాతం ఎక్కువగా..
    జీఎస్టీ వసూళ్లు మళ్లీ రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. జులై నెలలో రూ.1.48 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైందని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఒక్కరికే మళ్లీ మళ్లీ వస్తున్న కరోనా.. ఆ జౌషధమే​ కారణమా?..
    అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కొన్ని రోజుల క్రితం కొవిడ్ బారినపడ్డారు. అయితే ఆయనకు నాలుగు రోజుల్లోనే నెగెటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. మళ్లీ టెస్ట్ చేయగా పాజిటివ్​గా తేలింది. ఈ నేపథ్యంలో అందరి దృష్టి జో బైడెన్​కు చికిత్స అందించడంలో ఉపయోగించిన 'పాక్స్‌లవిడ్‌' అనే ఔషధంపైకి మళ్లింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details