- నర్సీపట్నంలో అయ్యన్న ఇంటి గోడ కూల్చివేత.. భారీగా మోహరించిన పోలీసులు
అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలోని.. మాజీ మంత్రి, తెదేపా సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడి నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఎలాంటి అల్లర్లు జరగకుండా.. అయ్యన్న ఇంటి వద్ద వందకు పైగా పోలీసులు పహారా కాస్తున్నారు.
- ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టినందుకే.. అయ్యన్న ఇంటిపై చీకటి దాడులు: చంద్రబాబు
చోడవరం మినీమహానాడు వేదికగా.. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టినందుకే అయ్యన్న ఇంటిపై చీకటి దాడులు చేయించారని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. తెలుగుదేశంలో బలమైన బీసీ నేతలే లక్ష్యంగా.. జగన్ రెడ్డి అక్రమ కేసులు, అరెస్టులు, దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
- 'వారికి టిక్కెట్లు ఇస్తే... ఓట్లు వేసేదేలే..' వైకాపాలో అసమ్మతి రాగం
అల్లూరి సీతారామరాజు జిల్లా వైకాపాలో విభేదాలు బయటపడ్డాయి. పార్టీ కోసం ఎంతో కష్టపడితే.. తమను పట్టించుకోవడం లేదని కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా మరో అడుగు ముందుకేసి అసమ్మతి వర్గమంతా సమావేశమై.. వచ్చే ఎన్నికల్లో ప్రస్తుతం ఎమ్మెల్యే, ఎంపీలకు సీట్లు ఇస్తే సహకరించమని.. ఓట్లు వేసేది లేదని తీర్మానించుకున్నారు.
- ARREST: తిరుపతి రైల్వేస్టేషన్ లక్ష్యంగా పోస్టులు.. ఇద్దరు ఆర్మీ అభ్యర్థుల అరెస్ట్..!
తిరుపతి రైల్వేస్టేషన్‌ను టార్గెట్ చేయాలనే లక్ష్యంగా పోస్టులు పెట్టిన ఇద్దరు ఆర్మీ అభ్యర్థులను తిరుపతి జిల్లా యర్రావారిపాళెం పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. సికింద్రాబాద్‌లో విధ్వంసం జరిగే ముందురోజే కొంతమంది యువకులు రైల్వే స్టేషన్ బ్లాక్, ఆర్మీ 17/6 అనే రెండు వాట్సాప్ గ్రూపులను క్రియేట్ చేసుకున్నట్లు నిఘా వర్గాలు కనుగొన్నట్లు తెలుస్తోంది.
- పక్షి దెబ్బకు విమానంలో మంటలు.. టేకాఫ్ అయిన వెంటనే ప్రమాదం.. లక్కీగా...
పట్నా నుంచి దిల్లీకి వెళ్లాల్సిన స్పైట్‌జెట్ విమానంలో మంటలు చెలరేగాయి. అయితే మంటలను గుర్తించి వెంటనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయగా.. ఎటువంటి నష్టం జరగలేదు. ఇంజిన్‌ను పక్షి ఢీకొనడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు స్పైస్‌జెట్ ప్రతినిధులు తెలిపారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేపడతామన్నారు అధికారులు.
- తనయుడితో కలిసి పదో తరగతి పరీక్ష.. తండ్రి పాస్.. కొడుకు ఫెయిల్
తండ్రీకొడుకులు ఇద్దరూ ఒకేసారి పదో తరగతి పరీక్షలకు హాజరయ్యారు. తాజాగా విడుదల చేసిన ఫలితాల్లో తండ్రి పాస్ కాగా.. కొడుకు ఫెయిల్ అయ్యాడు. ఈ ఆసక్తికర ఘటన మహారాష్ట్ర పుణెలో జరిగింది.
- ప్రవక్తపై వ్యాఖ్యలకు ప్రతీకారమే కాబుల్ దాడి.. ఐసిస్ ప్రకటన
అఫ్గానిస్థాన్ రాజధాని కాబుల్‌లో జరిగిన దాడిని తామే చేశామని ప్రకటించింది ఐసిస్ ఉగ్రసంస్థ. మహమ్మద్ ప్రవక్తపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలకు ప్రతీకారంగానే ఈ దాడి జరిపినట్లు పేర్కొంది.
- లీటర్ పెట్రోల్‌పై రూ.20, డీజిల్‌పై రూ.14.. మళ్లీ ధరలు పెంచక తప్పదా?
ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కొంతకాలంగా వాహనదారులకు ఉపశమనం కల్పిస్తున్నాయి. ఇంధన ధరలను పెంచకుండా స్థిరంగా కొనసాగిస్తున్నాయి. ఇటీవల కేంద్రం కూడా పెట్రోల్‌పై రూ.8, డీజిల్‌పై రూ.6 మేర ఎక్సైజ్ సుంకం తగ్గించింది. పలు రాష్ట్రాలు కూడా ఇదే బాటలో నిర్ణయం తీసుకున్నాయి.
- అక్కడ 'బాహుబలి 2' రికార్డును బ్రేక్ చేసిన కమల్ 'విక్రమ్'
దిగ్గజ నటుడు కమల్‌హాసన్ నటించిన 'విక్రమ్' సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. విడుదలైన 16 రోజుల్లోనే అదిరిపోయే వసూళ్లను అందుకుంది. ఓ రాష్ట్రంలో ఏకంగా 'బాహుబలి 2' రికార్డులను అధిగమించింది.
- T20 Worldcup: పంత్ వర్సెస్ దినేశ్ కార్తీక్.. అవకాశం దక్కేదెవరికో?
ఇటీవల దినేశ్ కార్తీక్ ఆటతీరు చూసిన పలువురు మాజీలు అతడు కచ్చితంగా టీ20 ప్రపంచకప్‌లో ఉండాలని ఆశిస్తున్నారు. మరోవైపు పంత్ టీ20 లీగ్‌లో అంతగా మెరవకపోవడం.. తాజా సిరీస్‌లో బ్యాటర్‌గా విఫలమవ్వడం అభిమానులను కలవరపెడుతోంది. దీంతో రాబోయే టీ20 ప్రపంచకప్‌లో అతడి కన్నా డీకేకే ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నారు.
ఏపీ ప్రధాన వార్తలు