- మాజీమంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కన్నుమూత
మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి(73) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బొజ్జల.. హైదరాబాద్ అపోలోలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
- రాష్ట్రాన్ని రక్షించుకునేందుకు.. మరో ప్రజాఉద్యమం : చంద్రబాబు
వైకాపా అరాచక పాలన నుంచి రాష్ట్రాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఏర్పడిందని తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇందుకోసం మరో ప్రజా ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందన్న బాబు.. ప్రజలు చేపట్టే ఈ ప్రజాఉద్యమానికి తెదేపా నాయకత్వం వహిస్తుందన్నారు.
- వ్యవసాయశాఖపై సీఎం జగన్ సమీక్ష.. 16న "రైతు భరోసా" ఇవ్వాలని ఆదేశం!
CM JAGAN REVIEW: ఈ నెల 11న "మత్స్యకార భరోసా", 16న "రైతు భరోసా" ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. శ్రీకాకుళంలో సాగు బోర్లకు మీటర్ల పైలట్ ప్రాజెక్టు విజయవంతం అయ్యిందని తెలిపారు. వ్యవసాయశాఖపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు.
- గులాబీ రిమోట్ కమలం చేతిలో.. ఈసారి టిక్కెట్లు వారికే : రాహుల్
Rahul Gandhi on TRS, BJP: తెరాసతో పొత్తు లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తేల్చి చెప్పారు. పొత్తుల గురించి కాంగ్రెస్‌లో ఎవరు మాట్లాడినా బహిష్కరిస్తామని హెచ్చరించారు. తెరాస, భాజపాతో అనుబంధముండే వాళ్లు కాంగ్రెస్‌లో ఉండొద్దని సూచించారు. తెరాసపై తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
- తెరుచుకున్న కేదార్నాథ్ ఆలయం.. మోదీ తొలిపూజ!
kedarnath: ఉత్తరాఖండ్‌లోని పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఒకటైన కేదార్నాథ్ ఆలయం ఆరునెలల సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి తెరుచుకుంది. శుక్రవారం ఉదయం 6.25 గంటలకు వేద మంత్రాల మధ్య తలుపులు తెరిచారు. అంతకుముందు ప్రధాన పూజారి నివాసం నుంచి కేదార్‌నాథుడి డోలీని ఆలయ ప్రాంగణంలోకి తీసుకొచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ తరఫున తొలి పూజ చేశారు అర్చకులు.
- డబ్ల్యూహెచ్ఓ నివేదికపై రాజకీయ దుమారం.. తప్పుపట్టిన 20 రాష్ట్రాల ఆరోగ్య మంత్రులు
WHO Covid Deaths India: ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన నివేదిక దేశంలో తీవ్ర రాజకీయ దుమారానికి దారి తీస్తుంది. నివేదికపై 20 రాష్ట్రాల ఆరోగ్య మంత్రులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మరోవైపు భాజపా, కాంగ్రెస్ పరస్పర విమర్శలు చేసుకుంటున్నాయి.
- డేవిడ్ వార్నర్.. సన్‌రైజర్స్‌పై స్వీట్ రివెంజ్..
IPL 2022 SRH VS DC warner record: సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో దిల్లీ ప్లేయర్ డేవిడ్ వార్నర్ పలు రికార్డులు సాధించాడు. తనను వదిలేసిన జట్టుపై అద్భుత ప్రదర్శన చేసి తన విలువేంటో తెలియజేశాడు. ఈ నేపథ్యంలో అతడి ఐపీఎల్ కెరీర్, ఈ సీజన్ ప్రదర్శన సహా సాధించిన రికార్డులను తెలుసుకుందాం..
- ఎల్ఐసీ ఐపీఓకు భారీ స్పందన.. రిటైల్‌లో 100% సబ్స్క్రిప్షన్
LIC IPO: ఎల్ఐసీ ఐపీఓ రిటైల్ ఇన్వెస్టర్ల విభాగంలో 100 శాతం సబ్స్క్రిప్షన్లు సాధించింది. ఈ విభాగంలో 6.9 కోట్ల షేర్లు కేటాయించగా 7.9 కోట్ల బిడ్లు దాఖలయ్యాయి. పాలసీదారులకు కేటాయించిన షేర్లకు మూడు రెట్లు, ఉద్యోగుల షేర్లలో 2.5 రెట్లు అధికంగా బిడ్లు వచ్చాయి. క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్స్, నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల నుంచి స్పందన అంతంత మాత్రంగానే ఉంది.
- కుప్పకూలిన ఆరు అంతస్తుల భవనం.. 53 మంది మృతి
చైనా, సెంట్రల్ హునాన్ ప్రావిన్స్‌లోని ఆరంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో మొత్తం 53 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 10 మందిని రక్షించారు. వారం క్రితం జరిగిన ప్రమాదంలో.. శిథిలాల కింద చిక్కున్న వారి కోసం చేపట్టిన సహాయక చర్యలు నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు.
- Review: 'అశోకవనంలో అర్జున కల్యాణం' ఎలా ఉందంటే..?
Ashokavanamlo Arjuna Kalyanam Review: మాస్ కా దాస్ విశ్వక్ సేన్.. 'అశోకవనంలో అర్జున కల్యాణం' సినిమాతో శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సినిమా ఎలా ఉంది? 'అల్లం అర్జున్' పాత్రంలో విశ్వక్ మెప్పించాడా?