ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రేపే టెన్త్ ఫలితాలు.. ఈ సారి ఇలా ప్రకటిస్తారు!

రేపు పదో తరగతి ఫలితాలను విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. అయితే ఈసారి ఫలితాలను గ్రేడ్లకు బదులు మార్కుల రూపంలో ప్రకటించనున్నట్లు పేర్కొంది. ఫలితాల్లో ర్యాంకులు ప్రకటించడంపై నిషేధమని స్పష్టం చేశారు.

tenth results
పదో తరగతి ఫలితాలు

By

Published : Jun 3, 2022, 6:49 AM IST

పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు శనివారం ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్‌ విజయవాడలో ఫలితాలు విడుదలచేస్తారు. 2019 తర్వాత కొవిడ్‌ కారణంగా రెండేళ్లు పరీక్షలు జరగలేదు. ఈ ఏడాది మళ్లీ పరీక్షలు నిర్వహించగా 6,21,799 మంది విద్యార్థులు రాశారు. ఈ సారి ఫలితాలను గ్రేడ్లకు బదులు మార్కుల రూపంలో ప్రకటించనున్నారు. పదో తరగతి ఫలితాల్లో ర్యాంకులు ప్రకటించడంపై నిషేధం విధిస్తున్నట్లు ఎగ్జామినేషన్స్‌ డైరెక్టర్‌ తెలిపారు. ర్యాంకులు ప్రకటిస్తే చట్టరీత్యా శిక్షార్హులని అన్నారు.

ర్యాంకులు ప్రకటించొద్దు :పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో విద్యార్థులకు ర్యాంకులు వచ్చినట్లు ఏ విధంగానూ ప్రచారం చేయకూడదని.. విద్యా సంస్థలను ఆదేశిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ర్యాంకుల పేరుతో జరిగే ప్రచారం వాస్తవాలను మభ్యపెట్టేలా ఉంటోందంటూ విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి అందిన విజ్ఞప్తుల మేరకు పాఠశాల విద్యాశాఖ ఈ ఉత్తర్వులు జారీచేసింది. తప్పుడు ప్రచారం చేసినట్లు తేలితే సంబంధితులకు మూడేళ్లకు తగ్గకుండా ఏడేళ్ల వరకు జైలుశిక్షను విధించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అలాగే రూ.లక్ష వరకు జరిమానా విధించే అధికారం కూడా ఉందని స్పష్టం చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details