ఈ నెల 16న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన సచివాలయంలోని బ్లాక్-1లో ఉదయం 11 గంటలకు భేటీ కానుంది. రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ తాగునీరు ఇచ్చేందుకు చేపట్టనున్న వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుపై మంత్రి మండలి సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం. మరికొన్ని సాగునీటి ప్రాజెక్టుల్లో రివర్స్ టెండరింగ్ అంశంతో పాటు... నవంబరు నెలలో మత్య్సకారులకు డీజిల్ సబ్సీడీ పెంపు, ఆర్థిక సాయం తదితర అంశాలపై మంత్రివర్గంలో చర్చించనున్నట్లు తెలుస్తుంది. నవంబరు 1వ తేదీన రాష్ట్ర అవతరణ దినోత్సవం నిర్వహించే అంశంపై చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు కొన్ని అంతర్జాతీయ సంస్థలు ఆసక్తి చూపుతుండటంతో వాటికి భూముల కేటాయింపుపైనా నిర్ణయం తీసుకోనున్నారు.
ఈ నెల 16న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం - ఈనెల 16న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం
ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన ఈనెల 16న మంత్రి మండలి భేటీ కానుంది. ఈ సమావేశంలో ఇంటింటికీ తాగునీటితోపాటు పలు కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది.
రాష్ట్ర మంత్రివర్గ సమావేశం