ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

త్వరలోనే డీఎస్సీ, టెట్ నిర్వహణపై నిర్ణయం: విద్యాశాఖ - ap school education latest news

పాఠ్య పుస్తకాలు అందని విద్యార్థులకు వచ్చే 15 రోజుల్లో అందజేస్తామని రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్ అన్నారు. గతేడాది కంటే విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో కొంతమందికి పుస్తకాలు అందలేదని తెలిపారు. వీలైనంత త్వరలోనే పుస్తకాలు అందజేస్తామని స్ఫష్టం చేశారు. త్వరలోనే డీఎస్సీ,టెట్ నిర్వహణపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.

ap school education principal secretary
ap school education principal secretary

By

Published : Mar 7, 2021, 5:43 PM IST

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ పాఠ్యపుస్తకాలు అందని విద్యార్థులకు వచ్చే 15 రోజుల్లో అందిస్తామని రాష్ట్ర విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుడితి రాజశేఖర్ స్పష్టం చేశారు. ఈ సారి అంచనాలకు మించి ప్రైవేటు పాఠశాలల నుంచి విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని ...దీనివల్ల కొంత మంది విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించలేకపోయామన్నారు. ఈ ఏడాది గత సంవత్సరం విద్యార్థుల సంఖ్య కంటే 5 లక్షలు పెరిగిందని.. ఫలితంగా విద్యార్థుల సంఖ్య 4,53,441 కు చేరుకుందన్నారు. ఈ ఏడాది 41 లక్షలు మాత్రమే ముద్రించడం జరిగిందని... దీంతో కొంతమంది విద్యార్ధులకు పాఠ్యపుస్తకాలు చేరలేదన్నారు. రూ.7 కోట్ల వ్యయంతో అదనంగా 4 లక్షల 11 వేల 427 మంది విద్యార్థులకు పాఠ్య పుస్తకాల ముద్రణకు ఉత్తర్వులు ఇచ్చామని త్వరలోనే ముద్రణ పూర్తవుతుందన్నారు. వీలైనంత త్వరలోనే విద్యార్థులకు పుస్తకాలు అందిస్తామన్నారు.

త్వరలోనే డీఎస్పీపై నిర్ణయం..

ఏపీలో తెలుగు, రాష్ట్ర స్థాయి విద్యకు ప్రాధాన్యత ఇస్తూనే సీబీఎస్‌ఈ విధానం అమలు చేయనున్నట్లు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి వెల్లడించారు. మెగా డీఎస్సీ, డీఎస్సీ, టెట్‌ నిర్వహణపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. గత మూడు నెలలుగా ప్రభుత్వ బడులను తనిఖీ చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి

అమరావతిని కాపాడుకునే బాధ్యత మీకు లేదా?: చంద్రబాబు

ABOUT THE AUTHOR

...view details